ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పని ఒత్తిడితో వీఆర్వో ఆత్మహత్య!

ABN, First Publish Date - 2022-12-15T03:23:32+05:30

పార్వతీపురం మన్యం జిల్లాలో బుధవారం ఓ వీర్వో ఆత్మహత్య చేసుకున్నారు. పని ఒత్తిడే కారణమని తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాలూరు రూరల్‌, డిసెంబరు 14: పార్వతీపురం మన్యం జిల్లాలో బుధవారం ఓ వీర్వో ఆత్మహత్య చేసుకున్నారు. పని ఒత్తిడే కారణమని తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మక్కువ మండలం బుచ్చింపేట గ్రామానికి చెందిన శంబంగి సంతో్‌షకుమార్‌ (30) సాలూరు మండలం మామిడిపల్లి వీఆర్వోగా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో భూముల రీ సర్వే, మ్యూటేషన్లపై ప్రభుత్వం లక్ష్యాలు విధించగా సకాలంలో పనులు పూర్తికాకపోవడం, ఉన్నతాధికారులకు సమాధానం చెప్పలేక ఒత్తిడికి గురయ్యారు. ‘ఇదేం ఉద్యోగం’ అని తోటి ఉద్యోగులతో ఓ సారి అన్నట్టు తెలిసింది. ఈ క్రమంలో విధుల్లో భాగంగా బుధవారం మామిడిపల్లికి వెళ్లిన ఆయన సాలూరు మండలం అంటివలస రహదారిలో ఓ మామిడితోటలో చెట్టుకు ఉరేసుకున్నారు. సంతో్‌షకుమార్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయనపై ఆధారపడిన తల్లి కూడా ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సాలూరు రూరల్‌ ఎస్‌ఐ కె.ప్రయోగమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-15T03:23:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising