ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీమా..ధీమా ‘లేదు’!

ABN, First Publish Date - 2022-10-08T05:16:33+05:30

ఈ బాధ ఈ మూడు కుటుంబాలదే కాదు. జిల్లా వ్యాప్తంగా 563 కుటుంబాలు వైఎస్సార్‌ బీమా పరిహారం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. గత ఏడాదికి సంబంధించి 291 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా...ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 272 మంది బీమా సభ్యులు మృత్యువాత పడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం రూ.6.51 కోట్ల పరిహారం పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏడాదిగా వైఎస్సార్‌ బీమా పరిహారం చెల్లింపులు నిల్‌

563 కుటుంబాల ఎదురుచూపు

గత ఏడాది దరఖాస్తులు 291 పెండింగ్‌

ఈ ఏడాది 272 దరఖాస్తులకు చిల్లిగవ్వ చెల్లించని వైనం

ప్రభుత్వ తీరుపై బాధితుల ఆగ్రహం

(రాజాం)

- రాజాం పట్టణానికి చెందిన కుర్మాపు కృష్ణారావు అనే వ్యక్తి కొద్ది నెలల కిందట ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతిచెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద మరణంతో ఆ కుటుంబం వీధిన పడింది. వైఎస్సార్‌ బీమా కోసం అన్నిపత్రాలు సమర్పించినా ఇప్పటివరకూ పరిహారం అందలేదు. దీంతో ఆ కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది.


- వస్త్రపురి కాలనీకి చెందిన రామారావు  అనే వ్యక్తి ప్రమాదంలో మృతిచెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వైఎస్సార్‌ బీమాలో సభ్యుడిగా ఉండడంతో పరిహారం కోసం కుటుంబసభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. అన్నిపత్రాలు సమర్పించినా ఇప్పటివరకూ పరిహారం దక్కలేదు. అధికారులు అదిగో..ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- రేగిడి మండలం సంకిలి గ్రామానికి చెందిన బగ్గు విమల  అనే మహిళ అకాల మరణం చెందారు. ఆమె వైఎస్సార్‌ బీమాలో నమోదై ఉన్నారు. కానీ పరిహారం విషయంలో అధికారులు కొర్రీలు పెడుతున్నారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. 

ఈ బాధ ఈ మూడు కుటుంబాలదే కాదు. జిల్లా వ్యాప్తంగా 563 కుటుంబాలు వైఎస్సార్‌ బీమా పరిహారం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. గత ఏడాదికి సంబంధించి  291 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా...ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 272 మంది బీమా సభ్యులు మృత్యువాత పడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం రూ.6.51 కోట్ల పరిహారం పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రన్న బీమా పథకం అమలుచేసేవారు. విజయవంతంగా నడిపారు. బీమాలో నమోదైన వ్యక్తి చనిపోతే అదే రోజు అంతిమ సంస్కారాలకు రూ.10 వేలు అందించేవారు. మిగతా మొత్తాన్ని దశదిశ కర్మ రోజు నామిని ఖాతాలో రూ.1.90 లక్షలు జమచేసేవారు. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు బీమా కొండంత అండగా నిలిచేది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పథకాన్ని నిలిపివేసింది. 2021 నుంచి వైఎస్సార్‌ బీమా పథకంగా పేరు మార్చి అమలుచేస్తోంది. కానీ  బీమా సాయాన్ని రూ.లక్షకు తగ్గించారు. గతంలో 17 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకూ ఇంట్లో ఎవరు మరణించినా బీమా వర్తించేంది. ఇప్పుడు రేషన్‌ కార్డులో ఉన్న ఒకరికి మాత్రమే పథకాన్ని వర్తింపజేశారు. ప్రమాదవశాత్తూ మరణం, శాశ్వత వైకల్యానికి రూ.5 లక్షలు,  పాక్షిక వైకల్యానికి రూ.2.5 లక్షలు, సాధారణ మరణానికి రూ.లక్ష చొప్పున సాయం ప్రకటించారు. 

అంతా అస్తవ్యస్తం

 బీమా పథకాన్ని వైసీపీ ప్రభుత్వం సచివాలయాలకు బదలాయించింది. బీమా పథకం అమలుకుగాను సచివాలయ కార్యదర్శి ఖాతాలో రూ.20 వేలు ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఇందుకుగాను స్మార్ట్‌ కార్డు అందించింది. ఎవరైనా బీమాలో నమోదైన వ్యక్తి చనిపోతే ఏటీఎం కార్డులో వివరాలు జనరేట్‌ చేసి రూ.10 వేలు డ్రా చేసి బాధిత కుటుంబసభ్యులకు అందించాలి. బీమా మొత్తం కైమ్‌ అయి.. ఖాతాలో నగదు పడితే.. సదరు బాధిత కుటుంబసభ్యులు తిరిగి రూ.10 వేలను సచివాలయ ఉద్యోగులకు అందించాలి. గతంలో బీమా మిత్రలు అన్నీతామై వ్యవహరించేవారు. ఇప్పుడు ఈ అస్పష్ట విధానంతో సచివాలయ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.  చనిపోయిన వ్యక్తి ధ్రువపత్రాలు పొందుపరిచేందుకు కుటుంబసభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ బాధితుడు ఇతర జిల్లాలో చనిపోతే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చనిపోతే ఆ సమీపంలోని సచివాలయంలో నమోదుచేసుకోవాలి. అక్కడ నుంచి ధ్రువపత్రాలు స్వస్థలానికి చేరుకోవడానికి చాలా సమయం పడుతోంది. ప్రమాదాలకు సంబంధించి క్లైముల్లో ఎడతెగని జాప్యం జరుగుతోంది. ఎఫ్‌ఐఆర్‌ పత్రాలు, పోస్టుమార్టం నివేదికలు రావడంలో ఆలస్యమవుతోంది. ఆస్పత్రుల్లో చనిపోయిన వారికి సకాలంలో మరణ ధ్రువపత్రాలు రావడం లేదు. రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడినప్పుడు.. వాహనాలకు సంబంధించి బీమా పత్రాల కోసం పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. అయితే అన్నిరకాల ధ్రువపత్రాలు సమర్పించినా అధికారులు మాత్రం ఏదో కొర్రీలు పెడుతూనే ఉన్నారు. 

సచివాలయం ద్వారానే..

వైఎస్సార్‌ బీమాకు సంబంధించి దరఖాస్తుల నమోదు నుంచి పరిహారం పంపిణీ ప్రక్రియ అంతా సచివాలయాల ద్వారానే జరుగుతోంది. పోలీస్‌, కార్మిక, రవాణా శాఖలతో డీఆర్‌డీఏ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే ధ్రువపత్రాలను పొందుపరచడంలో ఆలస్యం జరుగుతోంది. దాని ప్రభావం పరిహారం మంజూరుపై పడుతోంది. 

-కళ్యాణచక్రవర్తి, డీఆర్‌డీఏ పీడీ, విజయనగరం



Updated Date - 2022-10-08T05:16:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising