ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎప్పటి రేట్లు ఇవి?

ABN, First Publish Date - 2022-07-03T05:10:35+05:30

బ్రూ ప్యాకెట్‌ కిలో రూ.2.. సర్ఫ్‌ గుండ కిలో రూ.2.. అగ్గిపెట్టెలు డజను రూపాయి.. సంతూర్‌ సబ్బు రూ.2.. రిన్‌ సబ్బు రూ.2.. కొండచీపురు ఒకటి రూ.13.. కాబులీ శనగ కిలో రూ.4.. నువ్వులు కిలో రూ.4.. గ్లూకోజ్‌ కిలో రూ.4.. బొబ్బరు కిలో రూ.4.. దనియాలు కిలో రూ.4.. జీడిపప్పు కిలో రూ.95.. నెయ్యి కిలో రూ.34.. ఏంటీ? వీటి ధరలు ఇంత తక్కువేంటని ఆశ్చర్యపోతున్నారా?

తాటిపూడి గురుకులం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


గురుకులాలకు ఇచ్చే వస్తువుల ధరలపై విస్మయం
తలలు పట్టుకుంటున్న కాంట్రాక్టర్లు, ప్రిన్సిపాళ్లు

శృంగవరపుకోట రూరల్‌, జూలై 2:
బ్రూ ప్యాకెట్‌ కిలో రూ.2.. సర్ఫ్‌ గుండ కిలో రూ.2.. అగ్గిపెట్టెలు డజను రూపాయి.. సంతూర్‌ సబ్బు రూ.2.. రిన్‌ సబ్బు రూ.2.. కొండచీపురు ఒకటి రూ.13.. కాబులీ శనగ కిలో రూ.4.. నువ్వులు కిలో రూ.4.. గ్లూకోజ్‌ కిలో రూ.4.. బొబ్బరు కిలో రూ.4.. దనియాలు కిలో రూ.4.. జీడిపప్పు కిలో రూ.95.. నెయ్యి కిలో రూ.34.. ఏంటీ? వీటి ధరలు ఇంత తక్కువేంటని ఆశ్చర్యపోతున్నారా?
 ఏపీ గురుకుల విద్యాలయ సంస్థ తన పరిధిలోని పాఠశాలలు, కళాశాలలకు (2022-23 సంవత్సరానికి) పైవస్తువులు సరఫరా చేసేందుకు టెండర్లు పిలిచింది. జూన్‌నెలలో టెండర్లు ఆహ్వానించగా వారం తరువాత ఖరారు చేశారు. అయితే జీవోలో పైన చెప్పిన ధరలు కోట్‌ చేయడంతో ప్రిన్సిపాళ్లు, కాంట్రాక్టర్లు విస్తుపోతున్నారు. ఇంత తక్కువ ధరలతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం ఎలా అందిస్తారన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. జిల్లాలోని బొబ్బిలి, తాటిపూడి గురుకుల పాఠశాలల్లో 970 మంది, తాటిపూడి కళాశాలలో 260 మంది విద్యార్థినులు ఉన్నారు. మొత్తం 1,230 మంది విద్యను అభ్యసిస్తున్నారు.

టెండర్ల ప్రక్రియ ఇలా..
కలెక్టర్‌ ఆధ్వర్యంలో రెసిడెన్షియల్‌ జిల్లా కన్వీనర్‌ సరుకుల టెండర్‌ నోటీస్‌ ఇస్తారు. దీన్ని చూసిన కాంట్రాక్టర్లు సంబంధిత కార్యాలయానికి వెళ్లి సరుకుల ధరల వివరాలు తీసుకుంటారు. ఈ ధరల కన్నా తక్కువకు కోట్‌ చేసిన కాంట్రాక్టర్‌కు టెండర్‌ ఖరారు అవుతుంది. కాంట్రాక్టర్‌ ఏడాది పాటు కోట్‌ చేసిన ధరలకే సరుకులను అందిస్తారు.

జరిగేది ఇదే..
నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంత తక్కువ ధరకు ఎలా సరఫరా చేస్తారో అధికారులకే తెలియాలి. టెండర్లలో పేర్కొన్న వస్తువుల్లో అధిక ధరలు ఉన్న వాటిని కాంట్రాక్టర్లు వసతి గృహాలకు అందించరు. ఒకవేళ ఇచ్చినా అవి నాసిరకంగా ఉంటాయి. నాణ్యత విషయమై ప్రిన్సిపాళ్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండదు. పైన పేర్కొన్న వస్తువులు బహిరంగ మార్కెట్‌లో ఇలా ఉన్నాయి. (అంచనా రూ.లలో)

బ్రూకాఫీ కిలో    370
సర్ఫ్‌ కిలో         110
అగ్గిపెట్టెలు డజన్‌    6
సబ్బు ఒకటి        10
కాబూల్‌ శనగ కిలో    110
నువ్వులు కిలో     170
గ్లూకోజ్‌ కిలో     80
దనియాలు  కిలో     160
బొబ్బర్లు కిలో    60
జీడిపప్పు కిలో     650-700
నెయ్యి లీటరు        550-700

 టెండర్‌ విషయమై రెసిడెన్షియల్‌ కళాశాలల కన్వీనర్‌ రఘునాథ్‌నువివరణ కోరగా సరుకుల టెండర్‌లు ఖరారు విషయం ఆన్‌లైన్‌ ద్వారా కాంట్రాక్టర్లకు తెలియజేశామని, తాము చెప్పాకే సరుకుల సరఫరా ప్రారంభించాలని సూచించామని తెలిపారు.


Updated Date - 2022-07-03T05:10:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising