ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏం చేశారో పాపం!

ABN, First Publish Date - 2022-01-20T04:47:44+05:30

ఆ పల్లెలు గిరి శిఖరాన లేవు. చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతమూ లేదు. అయినా గిరిజనులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. మౌలిక సౌకర్యాలు కానరావడం లేదు. విద్య, వైద్యానికి ఇప్పటికీ కష్టమే. అర్హులైన వారికి పింఛను ఇవ్వడం లేదు. కరోనా వ్యాక్సిన కూడా నేటికీ చాలా మందికి అందకపోవడం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ఇదీ మెంటాడ మండలం లోతుగడ్డ, ఆండ్ర పంచాయతీల శివారు గ్రామాల గిరిజనుల దుస్థితి.

ఆవేదన వ్యక్తం చేస్తున్న కొండపర్తిబాడవ గిరిజనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆ గ్రామాల వైపు కన్నెత్తి చూడని అధికారులు, నేతలు

 మౌలిక సౌకర్యాలకు నోచుకోని గిరిజనులు

 అందరికీ అందని కరోనా వ్యాక్సిన్‌

 ఏడు గ్రామాల గిరిజనుల దుస్థితిది

 ఆ పల్లెలు గిరి శిఖరాన లేవు. చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతమూ లేదు. అయినా గిరిజనులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. మౌలిక సౌకర్యాలు కానరావడం లేదు. విద్య, వైద్యానికి ఇప్పటికీ కష్టమే. అర్హులైన వారికి పింఛను ఇవ్వడం లేదు. కరోనా వ్యాక్సిన కూడా నేటికీ చాలా మందికి అందకపోవడం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ఇదీ మెంటాడ మండలం లోతుగడ్డ, ఆండ్ర పంచాయతీల శివారు గ్రామాల గిరిజనుల దుస్థితి.


మెంటాడ, జనవరి 19:

మౌలిక సౌకర్యాలు లేక... ఆదుకునేవారు కరువై ఆ రెండు పంచాయతీల్లోని ఏడు గ్రామాల గిరిజనులు అవస్థలు పడుతున్నారు. అక్కడి పరిసరాలు చూస్తే అడవిలో ఓ మూ లన ఉన్న చిన్నచిన్న గూడేలను తలపిస్తున్నాయి. పరిశుభ్ర మైన తాగునీటికీ నోచుకోవడం లేదు. ఉపాధి లేక పేదరికం లో కొట్టుమిట్టాడుతున్నారు. లోతుగడ్డ పంచాయతీలోని పోర పుబాడవ, కొండపర్తిబాడవ, దోనుబిల్లి.. ఆండ్ర పంచాయతీ లోని వేపగుడ్డి, మిర్తివలస, కుంభివలస, పనసలవలస గ్రా మాల్లో సుమారు 200 మంది నివశిస్తున్నారు. పోడు వ్యవ సాయం, అటవీ ఉత్పత్తులే వారికి జీవనాధారం. పూర్వీ కుల నుంచీ అక్కడే ఉంటున్నారు. ప్రతి మంగళవారం ఆండ్ర వారపు సంతకు వచ్చి నిత్యావసరాలు తీసుకువె ళ్తుంటారు. లోతుగడ్డ పంచాయతీ పరిధి విద్యార్థులు కొండపర్తి, ఆండ్ర పంచాయతీ పరిధి విద్యార్థులు పన సలవలస పాఠశాలలో చదువుకుంటున్నారు. ఆండ్ర, కొండపర్తి గ్రామాలకు మిగతా పల్లెల గిరిజనులు వెళ్లి ప్రతినెలా రేషన్‌ సరుకులు, పింఛన్లు తీసుకుంటారు. ఇంటింటికీ పింఛన్‌ పంపిణీ ఊసేలేదు. కొందరికి అర్హతలు ఉన్నా పింఛను రావడం లేదు. ఎంతోమంది గిరిజనులు సంక్షేమ పథకాలకు దూరంగా ఉంటున్నారు. ఈ గ్రామాలకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో మైదాన ప్రాంతాలు న్నాయి. మరోవైపు ఈ గ్రామాలకు వెళ్లడానికి నడకదారులూ ఉన్నాయి. అయినా అధికారులు వారివైపు ఎందుకు చూడడం లేదో అంతుపట్టడం లేదు.


అనారోగ్యం బారిన పడినా...

ఆ గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండడం అరుదు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యాన్ని పర్యవేక్షించాల్సిన ఏఎనఎంలు, మెంటాడ పీహెచ్‌సీ వైద్యులు పట్టణాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అనారోగ్యంతో ఊళ్లకు ఊళ్లు మంచం పట్టినా.. వైద్యశిబిరాలు ఉండవు. వైద్య, ఆరోగ్య సిబ్బంది ఈ గ్రామాలను సందర్శించిన దాఖలాలు లేవని గిరిజనులు చెబుతున్నారు. జ్వరమొస్తే సమీప గ్రామాల ఆశ కార్యకర్తల వద్దకు మూడు, నాలుగు కిలోమీటర్లు నడుచుకుని వెళ్లి మాత్రలు తెచ్చుకుంటారు. అక్కడ గ్రామాలు ఉన్నట్లు తమకు తెలియదని కొందరు అధికారులు అనడం కొసమెరుపు. కుంభివలసలో మాత్రం ఆశ కార్యకర్త ఉన్నారు. ఆండ్ర పంచాయతీలోని  నాలుగు గ్రామాలకు ఏఎనఎం అప్పుడప్పుడు వెళ్తారని చెబుతున్నారు. 


అందని కరోనా వ్యాక్సిన్‌

అందరికీ కరోనా టీకా వేయాలని ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టింది. కానీ ఈ గ్రామాల్లో గిరిజనులకు 30 శాతం మించి వ్యాక్సిన్‌ అందలేదు. అదికూడా వారపు సంతలకు వచ్చిన వారికే టీకాలు వేశారు. 80 శాతం మందికి నేటి వరకు టీకా అందలేదు.


ఎవరూ రారు..

ఆ గిరిజన గ్రామాలకు ఏ ఒక్క అధికారీ వెళ్లినట్లు తెలియదు. రోగాలు వస్తే కొంతదూరం నడక, డోలీ ద్వారా  తరలించి కొండపర్తి నుంచి వాహనాల్లో తీసుకెళుతుంటాం. గ్రామ సభలు, కరోనా టీకా డ్రైవ్‌లు వంటి కార్యక్రమాలు వారికి తెలియదు.

-భీమారావు, సర్పంచ్‌, లోతుగెడ్డ


అధికారులను చూడలేదు..

మా గ్రామాలకు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతి నిధులు వచ్చిన దాఖలాలు లేవు. నేను, నా భార్య కొండపర్తి వెళ్లి కరోనా టీకా తీసుకున్నాం. నా తల్లిదండ్రులకు టీకాలు వెయ్యలేదు. వయసు పైబడిన వారు అక్కడికి రాలేకపోతున్నారు. గ్రామంలోకి వచ్చి పింఛన్లు అందించడం లేదు. జ్వరం వస్తే మాత్రలు ఇచ్చేవారు లేరు. మా బాధలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మేం ఉన్నట్లు గుర్తించడం లేదు.

-గౌరీ శంకర్‌, గిరిజన యువకుడు, కొండపర్తిబాడవ



Updated Date - 2022-01-20T04:47:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising