వేతన వేదన
ABN, First Publish Date - 2022-12-07T00:08:36+05:30
ఉపాధ్యాయులు జీతాల కోసం నిరీక్షిస్తున్నారు. నవంబరు నెలకు సంబంధించిన జీతం ఇప్పటివరకు వారు అందుకోలేదు. గత నెలలోనూ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. అక్టోబరు నెల జీతం సకాలంలో ఇవ్వకపోవడంతో గత నెల 8వ తేదీ వరకూ గురువులు ఆందోళనలు నిర్వహించారు.
జీతాల కోసం ఉపాధ్యాయుల నిరీక్షణ
కలెక్టరేట్, డిసెంబరు 6: ఉపాధ్యాయులు జీతాల కోసం నిరీక్షిస్తున్నారు. నవంబరు నెలకు సంబంధించిన జీతం ఇప్పటివరకు వారు అందుకోలేదు. గత నెలలోనూ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. అక్టోబరు నెల జీతం సకాలంలో ఇవ్వకపోవడంతో గత నెల 8వ తేదీ వరకూ గురువులు ఆందోళనలు నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా సుమారు 4వేల మందికి వేతనాలు విడుదల కాకపోవడంతో యుటీఎఫ్ ఆధ్వర్యంలో వారంతా నిరసన తెలిపారు. చివరికి నవంబరు 9న ప్రభుత్వం జీతాలు విడుదల చేసింది. ఈ నెల జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న ఉపాధ్యాయులందరికీ జీతాలు మంజూరు కాలేదు. జిల్లాలో సుమారు 9500 మంది ఉపాధ్యాయలు పని చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ నెల జీతాల మంజూరులో తీవ్ర జాప్యం జరగడంతో ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. అన్ని శాఖల అధికారులకూ జీతాలు విడుదల చేసి తమకే ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇంటి అద్దెలు, ఇతర అవసరాలు, ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతున్నామంటున్నారు.
దురదృష్టకరం
నవంబరు నెలకు సంబంధించి ఇప్పటివరకూ జీతాలు విడుదల కాకపోవడం చాలా దురదృష్టకరం. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పనిచేసిన కార్మికుడుకి సాయంత్రం కూలి డబ్బులు ఇస్తారు. తాము నెలంతా పనిచేసినా జీతాలు మంజూరు చేయకపోవడం అన్యాయం. తాము దాచుకున్న పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ వంటి బకాయిలు చాలా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని అడిగినా పట్టించుకోవడం లేదు.
- రమేష్ చంద్రపట్నాయక్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
===
Updated Date - 2022-12-07T00:08:38+05:30 IST