ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను నిలువు దోపిడీ చేయడం తగదు

ABN, First Publish Date - 2022-12-13T00:12:49+05:30

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేని దుస్థితి లో రైతులు ఉన్నారని, వారికి ఆదుకోవల్సిన ప్రభుత్వమే నిలువు దోపిడీ చేయడం తగదని మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు అన్నారు.

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గజపతినగరం: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేని దుస్థితి లో రైతులు ఉన్నారని, వారికి ఆదుకోవల్సిన ప్రభుత్వమే నిలువు దోపిడీ చేయడం తగదని మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు అన్నారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. గత మూడేళ్లుగా ధాన్యం కొనుగో ళ్లుకు సంబంధించి సుమారు రూ.400కోట్లు ఎమ్మెల్యేలు, మిల్లర్ల అసోసియేషన్‌, అధికారులు కుమ్మక్కుయి దోచుకున్నారని ఆరోపించారు. ఈ ఏడాది కూడా రైతుల ను జలగల్లా పిండుకు తినే విధంగా వలంటీర్ల వ్యవస్థను రంగంలోకి దించడం దారుణమన్నారు. 120 రోజులు పాటు పండించిన పంటను 40 కేజీల నుంచి 45 కేజీల వరకు రైతుల నుంచి తీసుకోవడం దారుణమన్నారు. అకాల వర్షాలు, తుఫా న్ల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు మేలు చేయలేకపోగా వారికి తీవ్ర నష్టాన్ని చవి చూసే విధంగా చర్యలు చేపట్టడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు. ఆర్బీకేల వద్ద రైతులకు ఎటువంటి ప్రయోజనాలు కల్పించడం లేదని కనీసం గోనె సంచులు కూడా లేకపోవడం దురదృష్టకరం అన్నారు. అవినీతి అక్రమాలు విడనాడకుంటే పెద్దఎత్తున పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్‌ అధికార ప్రతినిధి బండారు బాలాజీ, పార్టీ మండల అధ్యుక్షుడు అట్టాడ లక్ష్మునాయుడు, రాష్ట్ర రైతు కార్యదర్శి లెంక బంగారు నాయుడు, రుంకాణ అరుణ, జి.గోవింద, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:12:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising