యూటీఎఫ్ జీపుజాత
ABN, First Publish Date - 2022-10-18T04:38:24+05:30
గిరిజన విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం సీతంపేట ఐటీడీఏ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన జీపుజాత కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
గిరిజన విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
సీతంపేట: గిరిజన విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం సీతంపేట ఐటీడీఏ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన జీపుజాత కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన విద్యా రంగంలో ఉపాధ్యాయులు పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. జీవో నెంబర్-3 యథావిధంగా కొనసాగించాలని, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఏఎన్‌ఎంలను నియమించాలని భాషా వలంటీర్లకు వేతనం చెల్లించి రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. జీపుజాతలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీతంపేట ఏఎస్‌ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.మురళీమోహన్, తోట రమేష్, అప్పారావు, కిషోర్‌కుమార్, గౌరవాధ్యక్షుడు భాస్కరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విజయగౌరి, కృపానంద్, దండు ప్రకాశరావు, కృష్ణారావు, భామిని మండల నాయకులు తిరుపతిరావు, ప్రసాద్, రవి, శంకరరావు, సత్యనారాయణ పాల్గొన్నారు.
Updated Date - 2022-10-18T04:38:24+05:30 IST