ఆర్థిక సంఘ నిధులు వాడండి
ABN, First Publish Date - 2022-12-31T00:28:58+05:30
అవసరాలకు అనుగుణంగా 15వ ఆర్థికసంఘ నిధు లను వాడుకోవాలని డిప్యూటీ సీఈవో కే.రాజ్‌కుమార్ తెలిపారు.
లక్కవరపుకోట: అవసరాలకు అనుగుణంగా 15వ ఆర్థికసంఘ నిధు లను వాడుకోవాలని డిప్యూటీ సీఈవో కే.రాజ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన ఎల్.కోట ఎంపీడీవో కార్యాల యంలో అధికారులతో సమావేశమ య్యారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ చెత్తశుద్ధి కేంద్రాలు వాడా లని, పారిశుధ్య, విద్యుత్, తాగునీటి అవసరాలకు మార్గదర్శకాలు అనుగుణంగా 15వ ఆర్థిక సంఘ నిధులు వాడాలని చె ప్పారు. అదే విధంగా సఖి గ్రూపుల ద్వారా కౌమార బాలికల సంరక్షణ చేస్తున్నట్టు తెలిపారు. ఖాళీగా ఉన్న వాలంటీరు పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. కోవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్య క్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-31T00:28:59+05:30 IST