ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆత్మలకు ఉపాధి కూలి

ABN, First Publish Date - 2022-12-16T23:57:19+05:30

సాలూరు మండలంలో మాత్రం చనిపోయిన వారి పేరిట ‘ఉపాధి’ కూలి జమచేశారు. ఈ విషయాన్ని శుక్రవారం డీఆర్పీలు వెల్లడించారు.

ప్రజావేదికలో మాట్లాడుతున్న ఏపీడీ చంద్రావతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాలూరు రూరల్‌, డిసెంబరు 16: ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వేతనదారులకు కూలి చెల్లించడం సహజం. కానీ సాలూరు మండలంలో మాత్రం చనిపోయిన వారి పేరిట ‘ఉపాధి’ కూలి జమచేశారు. ఈ విషయాన్ని శుక్రవారం డీఆర్పీలు వెల్లడించారు. సాలూరు ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణంలో ఉపాధి సామాజిక ఆడిట్‌ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి సిబ్బంది ఉదారతను డీఆర్పీలు వెల్లడించడం విశేషం. వాస్తవంగా మండలంలో 2020-2021లో రూ.27,69,65,453, 2021-2022లో రూ.22,35,91,192లతో ఉపాధి పనులు జరిగాయి. వాటిపై ఇద్దరు ఎస్‌ఆర్పీల పర్యవేక్షణలో పది మంది డీఆర్పీలు 29 పంచాయతీల్లో సామాజిక ఆడిట్‌ను నిర్వహించారు. ఈ మేరకు ప్రజావేదికలో పంచాయతీల వారీగా వివరాలను డీఆర్పీలు వివరించారు. పట్టుచెన్నారు పంచాయతీలో చోడిపిల్లి రాజయ్య 2017లో మరణించగా, అయన ఖాతాకు 12 రోజుల ఉపాధి వేతనం జమ చేసినట్టు తెలిపారు. అదే పంచాయతీలో చోడిపిల్లి జంగులు 2018 మృతి చెందగా 2021 ఆగస్టు వరకు ఉపాధి కూలి జమ చేశారని వెల్లడించారు. ఈ విషయమై ఉపాధి సిబ్బందిని ఏపీడీ చంద్రావతి ప్రశ్నించగా సాంకేతిక సమస్య వల్ల అలా జరిగిందని బదులిచ్చారు. మరో చోట ఉపాధి పనులు చేసిన నలుగురు మహిళా కూలీలకు వేతనం జమకాలేదని డీఆర్పీలు తెలిపారు. ఇందుకు ఉపాధి సిబ్బందికి మద్దతుగా వైసీపీ నాయకుల మాట్లాడంతో ఎస్‌ఆర్పీ సూర్యనారాయణ జోక్యం చేసుకున్నారు. మాటమాత్రంగా సమాధానమిస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలకు న్యాయం జరగనప్పుడు ప్రజావేదిక లెందుకని అసంతృప్తి వ్యక్తం చేశారు. పగులుచెన్నారులో డబ్ల్యుబీఎం రోడ్డు పేరిట రూ.1.54 లక్షలు డ్రా చేసినప్పటికీ రికార్డులేవని డీఆర్పీలు తెలిపారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో రూ. 13 లక్షల విలువైన మొక్కలు నాటినట్లు చేబుతున్నప్పటికీ రికార్డులు లేవని, ఇలా అయితే ఆడిట్‌ ఏ విధంగా చేస్తామని వారు ప్రశ్నించారు. ఈ విషయమై ఏపీడీ చంద్రావతి జోక్యం చేసుకొని పదిరోజుల్లో మొక్కలు నాటాలన్నారు. అందుకు తోణాం సర్పంచ్‌ మువ్వల ఆదియ్య జోక్యం చేసుకొని ఏళ్ల తరబడి జరగనిది పది రోజుల్లో ఎలా సాధ్యమవుతుందన్నారు. ఇదిలా ఉండగా ఉపాధి సామాజిక ఆడిట్‌ ప్రజావేదికకు టీడీపీ తదితర విపక్ష నేతలు హాజరుకాలేదు. వైస్‌ ఎంపీపీ రెడ్డి సురేష్‌ , ఉపాధి ఏపీడీలు చంద్రావతి, శ్రీహరి, ఎంపీడీవో పార్వతి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు , వైసీపీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:57:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising