ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనధికార విద్యుత్‌ కోతతో అవస్థలు

ABN, First Publish Date - 2022-01-21T05:23:39+05:30

: అనధికార విద్యుత్‌ కోతతో జిల్లా ప్రజలు అవస్థలు పడ్డారు. గురువారం రాత్రి 6గంటల నుంచి 8గంటల వరకూ జిల్లా కేంద్రం మినహా అన్ని చోట్లా విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 విజయనగరం, జనవరి 20: అనధికార విద్యుత్‌ కోతతో జిల్లా ప్రజలు అవస్థలు పడ్డారు. గురువారం రాత్రి 6గంటల నుంచి 8గంటల వరకూ జిల్లా కేంద్రం మినహా అన్ని చోట్లా విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు.  విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు ఉన్నట్టుండి తీసుకున్న ఈ చర్యతో జిల్లాలో చీకట్లు అలముకున్నాయి. ఈ విషయాన్ని ఎస్‌ఈ నాగేశ్వరరావు వద్ద ప్రస్తావించగా ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌లో భాగంగా  1.45 గంటల పాటు రూరల్‌ ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేసినట్లు వెల్లడించారు.

నేడు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం  

రింగురోడ్డు: విద్యుత్‌ మరమ్మతుల పనులు కారణంగా  శుక్రవారం విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్టు ఎస్‌ఈ నాగేశ్వరరావు గురువారం తెలిపారు. నగరంలో కలెక్టరేట్‌, బాలాజీ మార్కెట్‌, కణపాక, కేఎల్‌పురం, ధర్మపురి, దాసన్నపేట, తోటపాలెం మండల పరిధిలోని జేఎన్‌టీయూ, కొండకరకాం, వైఎస్సార్‌ నగర్‌, సత్యా కళాశాల, ద్వారపూడి తదితర ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు.  అలకానంద కాలనీ, బొగ్గులదిబ్బ, ఆర్‌అండ్‌బీ జంక్షన్‌, ఎల్‌బీ కాలనీ, సీబీ కాలనీ తదితర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్టు చెప్పారు. నగరంలో వినియోగదారులు సహకరించాలని కోరారు.  

 

Updated Date - 2022-01-21T05:23:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising