ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైబర్‌ నేరాల నియంత్రణపై శిక్షణ

ABN, First Publish Date - 2022-01-19T04:36:10+05:30

రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్‌ నేరాల నియంత్రణ, దర్యాప్తునకు సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన సైబర్‌ ఇంటిలిజెన్స అండర్‌ డిటైల్‌ ఫోరెన్సిక్‌ సహకారంతో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ చెప్పారు.

వీడియో కాన్ఫరెన్సలో ఎస్పీ దీపికాపాటిల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీడియో కాన్ఫరెన్సలో డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ 

విజయనగరం క్రైం, జనవరి 18: రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్‌ నేరాల నియంత్రణ, దర్యాప్తునకు సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన సైబర్‌ ఇంటిలిజెన్స అండర్‌ డిటైల్‌ ఫోరెన్సిక్‌ సహకారంతో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ చెప్పారు. జిల్లా పోలీసు శిక్షణ కళాశాలలో ఈ నెల 17, 18 తేదీల్లో మూడు జిల్లాల పోలీసు అధికారులకు శిక్షణ ఇచ్చారు. రెండోరోజు సమావేశంలో మంగళవారం డీజీపీ వర్చువల్‌గా మాట్లాడుతూ సైబర్‌ నేరాల్లో దర్యాప్తును వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని జిల్లాల్లో కమిషనరేట్‌ పరిధిలో పనిచేసే దర్యాప్తు అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఎస్పీ దీపికాపాటిల్‌ మాట్లాడుతూ, అవగాహనతోనే సైబర్‌ నేరాల నియంత్రణ సాధ్యమన్నారు. ప్రత్యేక శిక్షణ, ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ని వినియోగించి నేరాలు చేధించవచ్చునని చెప్పారు. సైబర్‌ మోసాలు అనేక విధాలుగా జరుగుతున్నాయని.. మహిళలు, బాలికలకు వేధింపులు, ఆర్థిక నేరాలు, సోషల్‌ మీడియా వేదికగా వేధింపులు, మార్ఫింగ్‌, ప్రభుత్వ పథకాలను కాజేయడం, ఆధార్‌ కేవైసీ పేరుతో జరిగే మోసాలను చేధించడంపై సైబర్‌ నిపుణులతో శిక్షణ అందిస్తామన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎస్పీ అమితబర్డర్‌, విశాఖ రూరల్‌ ఎస్పీ కృష్ణారావు, విశాఖ సీటీ డీసీపీ గౌతమిశాలి, సైబర్‌ నిపుణులు, ఏఎస్‌పీలు, డీఎస్పీలు పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-19T04:36:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising