ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగారమ్మపేటలో పులి సంచారం

ABN, First Publish Date - 2022-07-29T05:31:50+05:30

బంగారమ్మపేట గ్రామం వద్ద పంటపొలాల్లో పులి పాదముద్రలు ఉన్నట్లు అటవీశాఖ అధికారి ఎ.ప్రహ్లాదరావు గురు వారం నిర్ధారించారు. మెంటాడ మండలం కొంప ంగి గ్రామానికి చెందిన ఆర్లి ఈశ్వరరావు గజపతి నగరం పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు.

ఆనవాళ్లు గుర్తిస్తున్న అటవీశాఖ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 పాదముద్రలను గుర్తించిన అటవీశాఖ అధికారులు
గజపతినగరం, జూలై 28:
బంగారమ్మపేట గ్రామం వద్ద పంటపొలాల్లో పులి పాదముద్రలు ఉన్నట్లు అటవీశాఖ అధికారి ఎ.ప్రహ్లాదరావు గురు వారం నిర్ధారించారు. మెంటాడ మండలం కొంప ంగి గ్రామానికి చెందిన ఆర్లి ఈశ్వరరావు గజపతి నగరం పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. మేనమామతో కలిసి బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై స్వగ్రామం వెళ్తుండగా బంగారమ్మపేట గ్రామ శివారు బట్టి కావలు వద్ద పులి ఉన్నట్టు గమ నించాడు. ఈ విషయాన్ని బంగారమ్మపేట గ్రామస్థులకు తెలిపాడు. గ్రామ రెవెన్యూ అధికారి విష్ణు సమాచారం అందుకుని పోలీసులకు తెలుపగా సీఐ ఎల్‌.అప్పలనాయుడు అటవీశాఖ అధికారులకు విషయం తెలియజేశారు. దీంతో గురువారం ఉదయం అటవీశాఖ డీఆర్‌వో ఎ.ప్రహ్లాదరావు, సెక్షన్‌ అధికారి కేవీఎన్‌ రాజు కలిసి ఆ  ప్రదేశాన్ని పరిశీలించారు. పులి అడుగులను గుర్తించారు. బూదేవిపేట గ్రామానికి చెందిన కడి యాల చంద్రయ్య పంటపొలంలో పులి సంచరించి నట్లు నిర్ధారించారు. మెంటాడ మండలం పణుకు వాణివలస గ్రామంలో గుర్తించిన పులి పాదము ద్రలు, బంగారమ్మపేట గ్రామ పంట పొలాల్లో గుర్తించిన అడుగులు ఒక్కటిగానే ఉన్నాయని అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు. బంగార మ్మపేట నుంచి  నేరుగా మరుపల్లి  కొండవైపు వెళ్లి  ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. గతంలో కూడా మరుపల్లి కొండ సమీపంలో పులి సంచరించిన ఆనవాళ్లను గుర్తిం చారు.  బంగారమ్మపేట, బూదేవిపేట, పాత బగ్గాం గ్రామాల ప్రజ లు అప్రమత్తంగా  ఉండాలని, రాత్రి సమ యాల్లో ఇంటి నుంచి  బయటకురావొద్దని  కోరారు. గజపతినగరం తహసీల్దార్‌  ఎం.అరుణకుమారి  ఆయా గ్రామాల్లో  దండోరా వేసి ప్రజలు అప్ర మత్తంగా  ఉండాలని సూచించారు.


Updated Date - 2022-07-29T05:31:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising