ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీలకు ఇదేం ఖర్మ

ABN, First Publish Date - 2022-12-07T00:06:46+05:30

రాష్ట్రంలో బీసీ వర్గాలు వైసీపీ పాలనలో అన్ని రకాలుగా మోసానికి గురయ్యాయని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆందోళన వ్యక్తం చేశారు. ‘కార్పొరేషన్లు ఫుల్‌.. నిధులు, విధులు నిల్‌’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయం వద్ద జరిగిన దీక్ష శిబరంలో ఆయన మాట్లాడారు.

శిబిరం వద్ద మాట్లాడుతున్న నాగార్జున
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున

చీపురుపల్లి/గజపతినగరం, డిసెంబరు 6: రాష్ట్రంలో బీసీ వర్గాలు వైసీపీ పాలనలో అన్ని రకాలుగా మోసానికి గురయ్యాయని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆందోళన వ్యక్తం చేశారు. ‘కార్పొరేషన్లు ఫుల్‌.. నిధులు, విధులు నిల్‌’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయం వద్ద జరిగిన దీక్ష శిబరంలో ఆయన మాట్లాడారు. బీసీల సంక్షేమం కోసమని ఏర్పాటు చేసిన వివిధ కార్పొరేషన్లు నిధుల లేక అలంకార ప్రాయంగా మిగిలాయన్నారు. రిజర్వేషన్లు, బీసీల రాయితీలకు జగన్‌ ప్రభుత్వం మంగళం పాడిందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రౌతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు, ముల్లు రమణ, సారేపాక సురేష్‌, పైల బలరాం, తాడ్డె సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలోనే బీసీలకు ప్రాధాన్యం

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే బీసీలకు అధిక ప్రాధాన్యం లభించిందని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి కేఏనాయుడు అన్నారు. ‘కార్పొరేషన్లు ఫుల్‌.. నిధులు, విధులు నిల్‌’ కార్యక్రమంలో భాగంగా స్థానిక పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలో డీటీ సత్యన్నారాయణకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు పీవీవీ గోపాలరాజు, అట్టాడ లక్ష్మునాయుడు, పెద్దింటి మోహన్‌, కోరాడ కృష్ణ, కొండపల్లి భాస్కరనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:06:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising