ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సుయాత్రను అడ్డుకున్న పోలీసులు

ABN, First Publish Date - 2022-07-26T04:20:14+05:30

విద్యారంగ పరిరక్షణ కోసం ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన బస్సు యాత్రకు పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రారంభమైన యాత్ర సోమవారం జిల్లాకు చేరుకుంది. కొత్తవలస ఫ్లైఓవర్‌ వద్ద అడ్డగించడంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు బా

కొత్తవలస ఫ్లైఓవర్‌పై భోజనాలు చేస్తున్న ఎమ్మెల్సీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోడ్డుపై భోజనాలు చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు

పార్వతీపురం టౌన్‌, జూలై 25 : విద్యారంగ పరిరక్షణ కోసం ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన బస్సు యాత్రకు పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రారంభమైన యాత్ర సోమవారం జిల్లాకు చేరుకుంది. కొత్తవలస ఫ్లైఓవర్‌ వద్ద అడ్డగించడంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, కేఎస్‌ లక్ష్మణరావు, వై.శ్రీనివాసరావు, ఐ.వెంకటేశ్వరరావు, షేక్‌ బాబ్జీలతో పాటు ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు రహదారిపై కూర్చొని భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రజాస్వామ్యయూతంగా బస్సు యాత్ర చేపడుతుంటే పోలీసులు అడుగడుగునా అడ్డు తగలడం భావ్యం కాదన్నారు. ప్రభుత్వం విద్యావ్యవస్థను సర్వ నాశనం చేస్తోందన్నారు. తక్షణం పాఠశాలల విలీన ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేయలేకే విలీన ప్రక్రియను తెరపైకి తెచ్చిందన్నారు. ప్రభుత్వానికి ప్రజా గుణపాఠం తప్పదన్నారు. కార్యక్రమంలో యూటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌. వెంకటేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్‌, జేవీవీ నేత జి. మురళీధర్‌, తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-07-26T04:20:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising