ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేరు మార్పు దారుణం

ABN, First Publish Date - 2022-10-08T05:00:18+05:30

విజయనగరం జిల్లాకేంద్రంలో మహారాజ ఆసుపత్రి పేరు మార్పుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కురుపాంలో నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  విజయనగరం మహారాజ ఆసుపత్రిగానే కొనసాగించాలి 

 టీడీపీ నేతల డిమాండ్‌.. 

 సర్కారు తీరుపై మండిపాటు 

పార్వతీపురం, అక్టోబరు7 (ఆంధ్రజ్యోతి)/కురుపాం:  విజయనగరం జిల్లాకేంద్రంలో మహారాజ ఆసుపత్రి పేరు మార్పుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పార్వతీపురంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు మాట్లాడుతూ.. ఇటీవల ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చిన సర్కారు తాజాగా విజయనగరం మహారాజ ఆసుపత్రిని సర్వజన ఆసుపత్రిగా మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ప్రభుత్వ దుర్మార్గమైన చర్య అని అన్నారు. రాజుల త్యాగాలను గుర్తించకుండా ఇష్టాను సారంగా వ్యవహరించడం తగదన్నారు. రానున్న కాలంలో విశాఖ కేజీహెచ్‌ పేరును మార్చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని తెలిపారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రహదారుల పరిస్థితి, అభివృద్ధిని పట్టించుకోని సర్కారు పేరు మార్పులపైనే శ్రద్ధ వహిస్తుండడం అరాచక పాలనకు నిదర్శనమన్నారు. రాజధాని కోసం భూముల త్యాగం చేసిన రైతులపైనా మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడడం ఎంతరవకూ సమంజసమని ప్రశ్నించారు.  రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో వెనక్కి నెట్టేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.   ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో గట్టిగా  బుద్ధి చెప్పనున్నారని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, రెడ్డి శ్రీనివాస్‌రావు, కోళ్ల బాబు, జి.రవికుమార్‌, బి.గౌరునాయుడు, బోను దేవిచంద్రమౌళి, తిరుపతిరావు పాల్గొన్నారు.  మహారాజా ఆసుపత్రి పేరు మార్పును నిరసిస్తూ కురుపాంలో టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించినఅనంతరం మోకాళ్లపై కూర్చొని ధర్నా చేశారు.  ఆసుపత్రి పేరును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అరకు పార్లమెంట్‌ ఉపాఽధ్యక్షుడు సువ్వాన గోవిందనాయుడు, నేతలు చందక రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-08T05:00:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising