చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ABN, First Publish Date - 2022-01-13T05:37:25+05:30
రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బహుజన కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు గొల్ల రామమూర్తి (57) బుధవారం విశాఖపట్టణం కేజీహెచ్‌లో మృతిచెందారు.
మృతుడు బహుజన కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు
కొత్తవలస, జనవరి 12: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బహుజన కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు గొల్ల రామమూర్తి (57) బుధవారం విశాఖపట్టణం కేజీహెచ్‌లో మృతిచెందారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వేపాడ మండలం, కృష్ణారాయుడుపేట గ్రామానికి చెందినగొల్ల రామమూర్తి బహుజన కళామండలి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఉద్యమ పాటలను పాడుతూ గుర్తింపు పొందాడు. ప్రస్తు తం కొత్తవలసలోనే నివాసం ఉంటున్న ఆయన ఈనెల 3న సాయంత్రం 7గంట ల సమయంలో కొత్తవలస నుంచి స్వగ్రామమైన క్రిష్ణారాయుడుపేటకు స్కూటీపై వెళ్తుండగా తుమ్మికాపల్లి బ్రిడ్జివద్ద శృంగవరపుకోట నుంచి మోటార్ సైకిల్‌పైవస్తున్న యువకుడు ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి విశాఖపట్టణం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మృతుడు రామమూర్తికి భార్య లక్ష్మి, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతి పట్ల దళిత సంఘాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి.
Updated Date - 2022-01-13T05:37:25+05:30 IST