ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సు చార్జీల పెంపు దారుణం

ABN, First Publish Date - 2022-07-03T05:12:07+05:30

కేంద్ర ప్రభుత్వం డిజల్‌ ధరలు తగ్గించినా ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్యుడిపై భారం వేయడం దారుణమని మాజీ మంత్రి, రాజాం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్‌ మండిపడ్డారు.

ఆర్టీసీ బస్సులో మాజీ మంత్రి కోండ్రు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


‘బాదుడే బాదుడు’లో మాజీ మంత్రి కోండ్రు
రాజాం, జూలై 2:
కేంద్ర ప్రభుత్వం డిజల్‌ ధరలు తగ్గించినా ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్యుడిపై భారం వేయడం దారుణమని మాజీ మంత్రి, రాజాం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్‌ మండిపడ్డారు. రాజాం- చీపురుపల్లి రోడ్డులో కొత్తవలస కూడలి వద్ద టీడీపీ అనుచరులతో శనివారం ఆయన ఆర్టీసీ బస్సు ఎక్కి బాదుడే- బాదుడు కార్యక్రమం చేపట్టారు. చార్జీల పెంపు వల్ల ఎంతభారం పడిందని ప్రయాణీకులను ప్రశ్నించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మూడుసార్లు చార్జీలు పెంచడం అన్యాయమన్నారు. పెంచిన బస్సు చార్జీలు తక్షణమే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలను వంచించడమే ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గురవాన నారాయణరావు, మరిపి జగన్మోహన్‌రావు, టంకాల నాగరాజు, మాడుగుల జయరాం, నారాయణరావు తదతరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-03T05:12:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising