ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటించాలి

ABN, First Publish Date - 2022-11-02T23:59:07+05:30

రైతుల పాదయాత్రకు సంబంధించి హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాలనిటీడీపీ రాష్ట్రఅధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ జగదీష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురం- ఆంధ్రజ్యోతి: రైతుల పాదయాత్రకు సంబంధించి హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాలనిటీడీపీ రాష్ట్రఅధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం పార్వ తీపురంలోని టీడీపీకార్యాలయంలో ఆయన విలేకర్లతో మా ట్లాడారు. రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేపడు తున్నారని, అయితే అడ్డుకొనేందుకు వైసీపీ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నరని ఆరోపించారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో పాదయాత్ర చేస్తే అప్పటి ముఖ్యమంత్రి ఏవిధంగా ఆ పాదయాత్రకు సహకరించారో తెలుసుకోవాలన్నారు. రెవె న్యూ మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు పేరుకే మూడు రాజధా నులని, ఒకటే రాజధాని ఉంటుందని మాట్లాడుతున్నారని అన్నారు. స్పీకర్‌ కూడా రైతుల పాదయాత్రపై విమర్శ చే యడం దారుణమన్నారు. రైతులు రాజధాని కోసం ల్యాండ్‌ పూలింగ్‌పై భూమి ఇవ్వడమే తప్పా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జి.రవికుమార్‌, ఎం.కార్తీక్‌, కోలా వెంకటరావు, కె.ప్రదీప్‌కుమార్‌. తాన్న ప్రసాద్‌, రెడ్డి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-02T23:59:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising