ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గ్రామాల అభివృద్ధి గాలికొదిలేశారు’

ABN, First Publish Date - 2022-08-11T05:53:26+05:30

‘గ్రామాల అభివృద్ధి గాలికొదిలేశారు’

కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న నాగార్జున
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చీపురుపల్లి/ మెరకముడిదాం: వైసీపీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని గాలిక వదిలేసిందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆరోపించారు. మెరకముడిదాం మండల ఇప్పలవలస గ్రామానికి చెందిన పలు కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరిన సందర్భంగా చీపురుపల్లిలోని తన నివాసంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం పార్టీలో చేరిన గవిడి వెంకటేశ్వరరావు, కెంగువ అప్పలనాయుడు, చందక రామస్వామినాయుడు, రౌతు అప్పలనాయుడు, ఈశ్వర్‌, లోచర్ల చిన్నంనా యుడు తదితరులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో చల్లా శ్రీరాం, కెంగువ ధనుంజయ్‌, పిన్నింటి సన్యాసినాయుడు పాల్గొన్నారు.


కష్టపడి పనిచేయండి

గుర్ల : ప్రతీ కార్యకర్త కష్టపడి పనిచేయాలని తెలుగుదేశం పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున పిలుపునిచ్చారు. బుధవారం పార్టీ మండల అధ్యక్షుడు సీహెచ్‌ మహేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో ఓటర్‌ నమోదు కార్య క్రమం విస్తృతం చేయాలన్నారు. 

- మన్యపూరిపేట గ్రామంలో అంగన్‌వాడీ బిల్డింగ్‌ పనులు పూర్తి చేసినా బిల్లులు ఇవ్వకుండా సర్పంచ్‌ ఇబ్బంది పెడుతున్నాడని ఎంపీడీవో కల్యాణికి కిమిడి నాగార్జున తెలిపారు. ఈ సమస్య పరిష్కరించాలని ఈ మేరకు బుధవారం ఆమెను కలిసి వినతిపత్రం అందించారు. పార్టీ నాయకులు మహేశ్వరరావు, సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T05:53:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising