ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేర్లు మార్పు వెనుక కుట్ర

ABN, First Publish Date - 2022-10-18T04:35:48+05:30

మొన్న ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ.. నేడు విజయనగరం మహారాజ ఆసుపత్రి పేర్లు మార్పు వెనుక భారీ కుట్ర జరుగుతోందని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత శత్రుచర్ల విజయరామరాజు అన్నారు.

రిలే దీక్షలో మాజీ ఎమ్మెల్సీ విజయరామరాజు, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్సీ శత్రుచర్ల మండిపాటు

  పెదమేరంగి కూడలిలో టీడీపీ రిలే దీక్ష 

జియ్యమ్మవలస, అక్టోబరు 17 : మొన్న ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ.. నేడు విజయనగరం మహారాజ ఆసుపత్రి పేర్లు మార్పు వెనుక భారీ కుట్ర జరుగుతోందని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. సోమవారం పెదమేరంగి కూడలిలో టీడీపీ మండల కన్వీనర్‌ పల్ల రాంబాబు ఆధ్వర్యంలో రిలే దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పును ప్రజలు ఏ మాత్రం సహించబోరన్నారు. ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెబుతారని చెప్పారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, అప్పుడు మళ్లీ పేర్లు మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం నియోజకవర్గ ఇన్‌చార్జి తోయక జగదీశ్వరి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ పరిస్థితి చూస్తే రాష్ట్రం పేరు కూడా మార్చేస్తారేమోనని ఆందోళనగా ఉందన్నారు. పేర్లు మార్పు వల్ల ఏమి సాధిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తీరును మార్చుకుని పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఈ నిరసన దీక్షలో టీడీపీ నేతలు డొంకాడ రామకృష్ణ, అక్కేన మధుసూదనరావు, దేవకోటి వెంకటినాయుడు, కోలా రంజిత్‌కుమార్‌, వెంపటాపు భారతి, మర్రాపు పురుషోత్తంనాయుడు, మూడడ్ల సత్యంనాయుడు, గురాన శ్రీరామ్మూర్తి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 


Updated Date - 2022-10-18T04:35:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising