ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సు చక్రాల కింద పడి..

ABN, First Publish Date - 2022-12-15T00:06:00+05:30

పాలకొండలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో రోడ్డుపై ఓ యువకుడు పడిపోగా అదే సమయంలో వస్తున్న బస్సు చక్రాల కింద పడి మృతి చెందిన ఘటన బుధవా రం చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పాలకొండలో యువకుడి మృతి

పాలకొండ: పాలకొండలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో రోడ్డుపై ఓ యువకుడు పడిపోగా అదే సమయంలో వస్తున్న బస్సు చక్రాల కింద పడి మృతి చెందిన ఘటన బుధవా రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.... ఎంఎంనగర్‌ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వైపు ఎంఎంనగర్‌కు చెందిన గుంపాడ రాజశేఖర్‌ (20) బుధవారం ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. ఆ సమయంలో ఆర్టీసీకాంప్లెక్స్‌ నుంచి ఏలాం సెంటర్‌ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న డి.ప్రవీణ్‌ రాజశేఖర్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో రాజశేఖర్‌ రహదారిపై పడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఓ విద్యాసంస్థ బస్సు చక్రాల కింద పడి నలిగిపోయాడు. దీంతో ఆయన్ను స్థానికులు 108 వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందాడు. రాజశేఖర్‌కు తల్లి కస్తూరి ఉన్నారు. ఇటీవలే తండ్రి రమణమూర్తి మృతిచెందాడు. రాజశేఖర్‌ మృతితో తల్లి విలపించింది. ఎస్‌ఐ శివప్రసాద్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-15T00:06:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising