తెలగ కులస్థులను బీసీలో చేర్చాలి
ABN, First Publish Date - 2022-11-21T00:35:41+05:30
తెలగ కులస్థులను బీసీ జాబితాలో చేర్చాలని ఏజెన్సీ తెలగ సంఘం అధ్యక్షుడు పైడా జగదీశ్వరరావు కోరారు.
గుమ్మలక్ష్మీపురం: తెలగ కులస్థులను బీసీ జాబితాలో చేర్చాలని ఏజెన్సీ తెలగ సంఘం అధ్యక్షుడు పైడా జగదీశ్వరరావు కోరారు. ఆయన ఆదివారం స్థానిక విలేక ర్లతో మాట్లాడారు. ఉత్తరాంధ్రలో నివశిస్తున్న తెలగ కులస్థులు అన్నింటా వెనుకబడి ఉన్నారని, జనాభాలో కూడా తక్కువగా ఉన్నారని చెప్పారు. ఆర్థికంగా, సామాజికం గా, రాజకీయంగా వెనుకబడి ఉన్న తెలగ కులస్థులను బీసీ జాబితాలో చేర్చాలని డి మాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2022-11-21T00:35:45+05:30 IST