ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనులు మంజూరు

ABN, First Publish Date - 2022-12-16T23:52:22+05:30

గడప గడపకు మన ప్రభుత్వం (జీజీపీఎం) కార్యక్రమంలో భాగంగా బొబ్బిలి, గజపతినగరం, రాజాం నియోజకవర్గాల్లో 915.62 లక్షలతో 292 అభివృద్ధి పనులు మంజూరైనట్లు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు శ్రీనివాసులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బిలి: గడప గడపకు మన ప్రభుత్వం (జీజీపీఎం) కార్యక్రమంలో భాగంగా బొబ్బిలి, గజపతినగరం, రాజాం నియోజకవర్గాల్లో 915.62 లక్షలతో 292 అభివృద్ధి పనులు మంజూరైనట్లు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మంజూరైన వాటిల్లో ఇప్పటికే 50 పను లను అప్పగించామని, ఇంతవరకు ఎటువంటి నిధులు వెచ్చించలేదని చెప్పారు. బొబ్బిలి, బాడంగి, తెర్లాం, రామభద్రపురం మండలాల్లో 59 పనులకు 170.20 లక్షలు మంజూరు కాగా, అందులో 28 పనులను, సంతకవిటి, వంగర, రాజాం, రేగిడి ఆమదాలవలస మండలాల్లో రూ.187.92 లక్షలతో 77 పనులు, గజపతిన గరం, దత్తిరాజేరు, మెంటాడ, బొండపల్లి, గంట్యాడ మండలాల్లో 156 పనులకు రూ.557.50 లక్షలు మంజూరవగా, 22 పనులను అప్పగించామని వివరించారు. 13 మండలాల్లో రూ.9,655 లక్షలతో 259 సచివాలయాల నిర్మాణాలు ప్రారంభించగా, రూ. 58 కోట్లతో 160 భవనాలను పూర్తి చేసినట్లు తెలిపారు. 249 ఆర్‌బీకేల్లో 108 భవనాలను, 215 కమ్యూనిటీ లెట్రిన్లకు గాను 62 పూర్తి చేశామ న్నారు. ఏపీ ఆర్‌ఆర్‌పీ (ఏపీఐఐబీ) పథకంలో భాగంగా గజపతినగరం నియోజక వర్గంలో 58 పనులకు గాను 25 పూర్తి చేశామన్నారు. బొబ్బిలిలో 92 పనులకు 14, రాజాం నియోకవర్గంలో 51 పనులకు గాను రెండు పనులు పూర్తి చేశామని చె ప్పారు. భవనాల నిర్మాణాలను ఈ నెలాఖరుకు, రోడ్ల పనులను మార్చి నెలాఖరు లోగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-12-16T23:52:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising