ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సకాలంలో జీతాలు చెల్లించాలి

ABN, First Publish Date - 2022-11-09T00:40:41+05:30

ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు.

డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉపాధ్యాయుల డిమాండ్‌

పార్వతీపురం రూరల్‌, నవంబరు 8 : ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. మంగళవారం యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లేట్లు చేతపట్టుకొని భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని ఉపాధ్యాయులు ఎదుర్కొలేదని యూటీఎఫ్‌ జిల్లా నాయకుడు ఎస్‌.మురళీమోహన్‌ తెలిపారు. సకాలంలో జీతాలు చెల్లించకపోగా, యాప్‌లతో ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. బైజూస్‌ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ఫోన్‌ నెంబర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదనే కారణంతో ఉపాధ్యాయులకు ఇచ్చిన షోకాజ్‌ నోటీసులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డీఈవో ఎస్‌డీవీ రమణకు వినతిపత్రాన్ని అందించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని డీఈవో తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాల్సిందేనని చెప్పారు. ఈ నిరసనలో యూటీఎఫ్‌ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-09T00:40:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising