ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంగరలో ఆర్టీసీ బస్సు మాయం

ABN, First Publish Date - 2022-08-10T05:24:34+05:30

వంగరలో ఆర్టీసీ బస్సు మాయం

చోరీకి గురైన ఆర్టీసీ బస్సు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మీసాలడోలపేటలో లభ్యం 

- జీపీఎస్‌ ఆధారంగా చోరీకి గురైన బస్సు గుర్తింపు 

వంగర, ఆగస్టు 9: వంగరలో మాయమైన ఆర్టీసీ బస్సును జీపీ ఎస్‌ ఆధారంగా రేగడి మం డలం లోని మీసాలడోలపేటలో గుర్తించా రు. పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది కథనం మేరకు.. విద్యార్థుల కోసం కేటాయించి న బస్సు సోమవారం రాత్రి ఏడు గంటలక ు వంగర చేరింది. విద్యార్థులు దిగిన తర్వాత డ్రైవర్‌ పీఎస్‌ బుజ్జిబాబు పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలో ఇంటికి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం ఏడు గంటలకు విద్యార్థులతో రాజాం బయలుదేరాల్సిఉంది. దీంతో డ్రైౖవర్‌ ఉదయం బస్సు పార్కింగ్‌చేసిన చోటికి వచ్చాడు. అయితే అక్కడ బస్సులేకపోవడంతో పోలీసులు, ఆర్టీసీ అధికారులకు తెలియజేశా డు. పాలకొండ డిపో మేనేజర్‌ వేంకటేశ్వరులు, ఎస్‌వో లక్ష్మణ రావు వంగర చేరుకున్నారు. ఇంతలో జీపీఎస్‌ ఆధారంగా రేగిడి మండ లంలోని మీసాలడోలపేట వద్ద ఉన్నట్లు గుర్తించిన అధికారులు అక్కడకు చేరుకున్నారు. మీసాడోలపేట సమీపంలోని నిర్జీవమైన ప్రదేశంలో బస్సు తిరగడానికి వీలు లేని మలు పు ఉండడంతో అక్కడ విడిచి పారిపోయినట్లు గుర్తించారు. అక్కడ పలువుర్ని విచారించగా ఎటువంటి సమాచారం లభ్యంకాక పోవడంతో వెనుదిరిగారు. మద్యం మత్తు లో కొందరు ఆకతాయిలు బస్సును కొంత దూరం డ్రైవ్‌చేసుకొని వెళ్లారని పోలీసులు చెబుతున్నా రు. డిపోమేనేజర్‌ వెంకటేశ్వరులు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రాము కేసు నమోదుచేశారు. మీసాలడోలపేట వద్ద మలుపు లేకుంటే బస్సు ఒడిశా వైపు దొంగలు తరలించుకుపోయి ఉండేవారని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. 

Updated Date - 2022-08-10T05:24:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising