ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్షం పడితే ఇంతే..

ABN, First Publish Date - 2022-08-10T05:11:55+05:30

చినుకు పడితే చాలు.. జిల్లాలో అనేక రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు, ప్రజలు రాకపోకలు సాగించలేకపోతున్నారు.

కురుపాంలో రోడ్డుపై గుంతలో నాట్లు వేస్తూ నిరసన తెలయిజేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  చెరువులను తలపిస్తున్న రహదారులు

  రాకపోకలకు తప్పని ఇబ్బందులు

పార్వతీపురం - ఆంధ్రజ్యోతి/కురుపాం, ఆగస్టు 9 :   చినుకు పడితే చాలు.. జిల్లాలో అనేక రహదారులు    చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు, ప్రజలు రాకపోకలు సాగించలేకపోతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి. అల్పపీడనం కారణంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు  పార్వతీపురం-పాలకొండ రహదారి, తోటపల్లి కుడి కాలువ సమీపంలో ఉన్న ప్రధాన రోడ్డు, పార్వతీపురం మండలం ఎల్‌ఎన్‌ పురం రహదారి మరింత అధ్వానంగా మారాయి. ఆయా రోడ్లపై ఏర్పడిన గోతుల్లో వర్షపునీరు చేరింది. ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక పలువురు జాగ్రత్తగా వాహనాలను నడపాల్సి వస్తోంది. ఇంకొందరు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రభుత్వం రహదారుల మరమ్మతులపై దృష్టి సారించకపోవడంపై ఆయా ప్రాంతవాసులు పెదవి విరుస్తున్నారు. ప్రధాన రహదారులే ఇలా ఉంటే.. ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక కురుపాంలో టీడీపీ నేతలు మంగళవారం వినూత్నంగా నిరసన తెలిపారు. కురుపాం నుంచి పార్వతీపురం వెళ్లే రోడ్డుపై ఉన్న గుంతల్లో వరినాట్లు వేస్తూ నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించి రోడ్లపై గుంతలు పూడ్చాలని వారు డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2022-08-10T05:11:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising