ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోగిన పెళ్లిబాజా

ABN, First Publish Date - 2022-12-13T23:33:11+05:30

ప్రస్తుతం శుభాకార్యాల సందడి నెలకొంది. మార్గశిర మాసం కావడంతో శుభ ముహూర్తాలు అధికం. గృహప్రవేశాలు, వివాహాలు, నిశ్చితార్థాలు, బాలసారెలకు శుభ ముహూర్తాలుండడంతో జోరుగా సాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోగిన పెళ్లిబాజా

శుభకార్యాలూ అధికం..

(సాలూరు రూరల్‌)

ప్రస్తుతం శుభాకార్యాల సందడి నెలకొంది. మార్గశిర మాసం కావడంతో శుభ ముహూర్తాలు అధికం. గృహప్రవేశాలు, వివాహాలు, నిశ్చితార్థాలు, బాలసారెలకు శుభ ముహూర్తాలుండడంతో జోరుగా సాగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే ఉమ్మడి జిల్లాలో పదివేల వివాహాలు జరుగుతున్నట్టు ఒక అంచనా. శుక్రమౌఢ్యమి కావడంతో ఈ ఏడాది ఆగస్టు 24 తరువాత శుభ ముహూర్తాలు లేవు. మార్గమాసం కావడంతో ఈ నెల 2 నుంచి శుభ గడియలు ప్రారంభమయ్యాయి. గత మూడు నెలలుగా శుభకార్యాలు లేకపోవడంతో వ్యాపారాలు మందకొడిగా సాగాయి. అటు అనుబంధ కార్మికులకు కూడా పని లేకుండాపోయింది. ఇప్పుడు శుభకార్యాలు జోరుగా సాగుతుండడంతో చేతినిండా దండిగా పని దొరుకుతోంది. వస్త్ర, బంగారం వ్యాపారం జోరందుకుంది. కళ్యాణమండపాలు, భాజభజంత్రీలు, మైక్‌సెట్లు, లైటింగ్‌, వీడియోగ్రాఫర్లు, వంటవార్లకు డిమాండ్‌ ఏర్పడింది. ఈ నెల 16, 17, 18 సైతం ముహుర్తాలున్నాయి. వాటిలో ఈ నెల 18 దివ్యముహుర్తంగా పండితులు చెబుతున్నారు.

Updated Date - 2022-12-13T23:33:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising