ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌సీఎస్‌ షుగర్స్‌ వద్ద ఆంక్షలు

ABN, First Publish Date - 2022-01-20T04:51:10+05:30

చెరకు రైతుల బకాయిల కోసం రైతు సంఘాల ప్రతినిధులు గురువారం లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారం ముందు ఆందోళన చేసేందుకు పిలుపునిచ్చారని, సెక్షన్‌ 30, సెక్షన్‌ 144 అమలులో ఉన్నందున ఎటువంటి కార్యక్రమాలకు అనుమతి లేదని బొబ్బిలి డీఎస్పీ బి.మోహనరావు తెలిపారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ మోహనరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెక్షన 30, 144 అమలు

డీఎస్పీ మోహనరావు

బొబ్బిలి రూరల్‌ జనవరి 19: చెరకు రైతుల బకాయిల కోసం రైతు సంఘాల ప్రతినిధులు గురువారం లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారం ముందు ఆందోళన చేసేందుకు పిలుపునిచ్చారని, సెక్షన్‌ 30, సెక్షన్‌ 144 అమలులో ఉన్నందున ఎటువంటి కార్యక్రమాలకు అనుమతి లేదని బొబ్బిలి డీఎస్పీ బి.మోహనరావు తెలిపారు. తన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీతానగరం తహసీల్దారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నెలాఖరు వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ముట్టడి వంటి ఆందోళనల్లో రైతులెవరూ పాల్గొనరాదని చెప్పారు. గత నవంబరులో జరిగిన ఆందోళనలో వందమంది రైతులపై కేసులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.  చట్టవిరుద్ధంగా నిర్వహించే ఎటువంటి ఆందోళనలోనైనా పాల్గొంటే మళ్లీ కేసులు పెడతామని డీఎస్‌పి హెచ్చరించారు.  చెరకు రైతుల బకాయిల చెల్లింపునకు సంబంఽధించి అధికార యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. భూముల వేలం వాయిదా పడినప్పటికీ త్వరలోనే మళ్లీ నిర్వహిస్తారన్నారు.   ఇప్పటికే వేలం వేసిన పంచదార బస్తాలకు సంబంధించి కోర్టు కేసు నడుస్తోందని, దీనిపై ఈ నెల 21 న హైకోర్టు తీర్పు వస్తుందన్నారు. ఈ రెండు ప్రక్రియలు పూర్తయిన వెంటనే రైతుల బకాయిల సమస్య పూర్తిగా  పరిష్కారమవుతుందన్నారు. రైతులంతా సంయమనం పాటించి పోలీసుశాఖకు సహకరించాలన్నారు. కొవిద్‌ నిబంధనల దృష్ట్యా రాత్రివేళ  కర్ఫ్యూ అమలులో ఉందన్నారు. 



Updated Date - 2022-01-20T04:51:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising