ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వారీ నిర్వహణపై ప్రజాభిప్రాయ సేకరణ

ABN, First Publish Date - 2022-12-15T00:09:22+05:30

గరుడుబిల్లి గ్రామం సమీపంలో గల క్వారీ నిర్వహణకు అనుమతులపై బుధవారం అధికారులు ప్రజా భిప్రాయ సేకరణ చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొండపల్లి: గరుడుబిల్లి గ్రామం సమీపంలో గల క్వారీ నిర్వహణకు అనుమతులపై బుధవారం అధికారులు ప్రజా భిప్రాయ సేకరణ చేపట్టారు. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆఽధ్వర్యంలో ఈ కార్య క్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్వే నెంబరు 187/2లో గల ఎనిమిది హెక్టార్లలో ఉన్న క్వారీ నుంచి రోడ్డు మెటల్‌తోపాటు బిల్డింగ్‌ స్టోన్స్‌ ఉత్పత్తికి అనుమతులు కేటాయించడంపై విజయనగరం డీఆర్వో ఎం.గణపతిరావు ఆధ్వర్యంలో ప్రజల అభిప్రాయం తెలుసుకున్నారు. క్వారీ నిర్వహ ణకు గతంలో ఇచ్చిన గడువు ముగిసిందని, దీన్ని కొనసాగింపుపై ప్రజల అభిప్రా యం తెలుసుకుంటున్నట్టు డీఆర్వో తెలిపారు. గరుడుబిల్లి, కొండకిండాం, వేండ్రాం తదితర గ్రామాలకు చెందిన ప్రజలకు తమకు చెప్పారు. యాజమాన్యం నిబంధనలు ప్రకారం చేయాల్సిన పనులు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు ఈఈ సుదర్శన్‌, భూగర్భ గనుల శాఖ ఏడీ మహేశ్వరరావు, తహసీల్దార్‌ శ్రీనివాస్‌మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:09:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising