ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధర పతనం

ABN, First Publish Date - 2022-08-14T05:12:33+05:30

ఆయిల్‌పామ్‌ గెలల టన్ను ధర ఒక్కసారిగా పతనమైంది. నెల రోజుల వ్యవధిలో రూ. 5,858 తగ్గడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.

విక్రయానికి సిద్ధంగా ఉన్న ఆయిల్‌పామ్‌ గెలలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ఆయిల్‌పామ్‌ టన్నుకు రూ.5 వేలు తగ్గుదల

  నెల రోజుల వ్యవధిలో మార్పు

కొమరాడ :  ఆయిల్‌పామ్‌ గెలల టన్ను ధర ఒక్కసారిగా పతనమైంది.  నెల రోజుల వ్యవధిలో రూ. 5,858 తగ్గడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. వాస్తవంగా జిల్లాలో సుమారు 18 వేల ఎకరాల వరకు ఆయిల్‌పామ్‌ సాగు జరుగుతుంది. ఇందులో 5 వేల ఎకరాల్లో కౌలు రైతులు సాగు చేస్తున్నారు.  కాగా ఈ ఏడాది జూన్‌ 25 వరకు టన్ను ధర  ధర రూ. 22,770 ఉంది.  గతంలో ఎన్నడూ లేని విధంగా ధర పలకడంతో రైతులందరూ ఈ సాగుపై దృష్టిసారించారు. ఎకరాకు సుమారు రూ.60 వేల వరకూ పెట్టుబడి పెట్టారు.  కౌలు రైతులు ఆయిల్‌పామ్‌ తోటలను ఎకరాకు రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు చెల్లించారు.  ఆయిల్‌పామ్‌ గెలలకు రేటు అధికంగా ఉండడంతో కోత కోసేవారు, తోట నుంచి ట్రాక్టర్లలోకి లోడ్‌ చేసే వారు కూడా కూలి రేట్లు పెంచేశారు. అయితే జూన్‌, జూలై నెలల్లో ధర ఆశాజనకంగా ఉండడంతో లాభాలు వస్తాయని రైతులు ఆశించారు. ప్రస్తుతం సీన్‌ రివర్స్‌ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్పత్తి అధికమవడంతో  టన్ను ధర రూ. 16,912కు  పడిపోయింది.  ఒక్కసారిగా ధర పతనం కావడంతో ఎకరాకు రూ. 40 వేలు వరకు నష్టపోయే పరిస్థితి ఉందని  రైతులు వాపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. 

 

 

Updated Date - 2022-08-14T05:12:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising