ఈదురుగాలులతో వాన
ABN, First Publish Date - 2022-04-25T05:45:32+05:30
వేపాడ, లక్కవరపుకోట మండలాల్లో ఆదివారం ఈదురుగాలులతో వాన పడింది. వాన మోస్తరుగా కురిసినప్పటికీ గాలులకు మామిడి, జీడి పంటలకు కొత్త నష్టం వాటిల్లింది. వేపాడ మండలం వావిలపాడులో వడగళ్లు పడ్డాయి. ఇదే గ్రామానికి చెందిన రంది చెల్లంనాయుడు రెండెకరాల్లో సాగు చేసిన అరటితోట నేలపాలైంది.
వేపాడ/ లక్కవరపుకోట, ఏప్రిల్ 24 : వేపాడ, లక్కవరపుకోట మండలాల్లో ఆదివారం ఈదురుగాలులతో వాన పడింది. వాన మోస్తరుగా కురిసినప్పటికీ గాలులకు మామిడి, జీడి పంటలకు కొత్త నష్టం వాటిల్లింది. వేపాడ మండలం వావిలపాడులో వడగళ్లు పడ్డాయి. ఇదే గ్రామానికి చెందిన రంది చెల్లంనాయుడు రెండెకరాల్లో సాగు చేసిన అరటితోట నేలపాలైంది. సుమారు రూ.లక్ష వరకు ఆస్తినష్టం జరిగినట్టు రైతు వాపోయాడు. వెంకయ్యపాలెం, పోతుబంది పాలెం, కరకవలస తదితర గ్రామాల్లోనూ మామిడి కాయలు, జీడి పిక్కలు నేలపాలయ్యాయి. లక్కవరపుకోట మండలం కల్లేపల్లి, రేగ, లచ్చంపేట, తామరాపల్లి, శ్రీరాంపురం, గోల్డ్‌స్టార్ జంక్షన్, ఆర్జీపేట గ్రామాల్లోనూ వడగళ్లు పడ్డాయి. మామిడి పంటకు నష్టం వాటిల్లిందని రైతులు వెంకటరావు, స్వామినాయుడు తెలిపారు. ఉక్కబోత నుంచి ఉపశమనం లభించిందని ప్రజలు అభిప్రాయపడ్డారు.
Updated Date - 2022-04-25T05:45:32+05:30 IST