ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగనన్న కాలనీలకు విద్యుత్‌ సదుపాయం కల్పించండి

ABN, First Publish Date - 2022-12-16T23:57:39+05:30

జిల్లాలో జగనన్న కాలనీలకు విద్యుత్‌ సదుపాయం కల్పించాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆదేశించారు.

సమావేశంలో మాటాడుతున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురం రూరల్‌, డిసెంబరు 16 : జిల్లాలో జగనన్న కాలనీలకు విద్యుత్‌ సదుపాయం కల్పించాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కాలనీలో ఇంటికి విద్యుత్‌ కనెక్షన్‌ ఉండాలన్నారు. పాచిపెంట మండలంలో జగన్న కాలనీకి ఐదు రోజుల్లో , మిగిలిన చోట్ల మూడు నుంచి పది రోజుల్లో విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలని చెప్పారు. లే అవుట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.70లక్షలు చొప్పున విడుదల చేసినప్పటికీపనుల జాప్యానికి కారణమేమిటని అధికారులను ప్రశ్నించారు. ప్రాధాన్య క్రమంలో పనులు ఎందుకు వేగవంతంగా జరగడం లేదని అడిగారు. పీఎం ఆవాస్‌ యోజనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 1,680 గృహాలు ఐదు రోజుల్లో మంజూరు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీవో కె.హేమలత , గృహ నిర్మాణ సంస్థ పీడీ పి.రఘరాం, ఈఈ రమేష్‌, మునిసిపల్‌ కమిషనర్లు జె.రామ అప్పలనాయుడు, హెచ్‌.శంకరరావు, ఎస్‌.సర్వేశ్వరరావు, ఈపీడీసీఎల్‌ ఇంజనీరింగ్‌ అధికారి ఓ.ప్రభాకర్‌రావు, హౌసింగ్‌ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:57:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising