ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి

ABN, First Publish Date - 2022-12-15T00:04:45+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఐక్యపోరాటాలకు కార్మికులంతా సిద్ధంకావాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ నర్సింగరావు పిలుపునిచ్చారు.

నూతన కమిటీని అభినందిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు పిలుపు

పార్వతీపురం టౌన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఐక్యపోరాటాలకు కార్మికులంతా సిద్ధంకావాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ నర్సింగరావు పిలుపునిచ్చారు. బుధవారం పార్వతీపురంలో జిల్లా మహాసభల్లో భాగంగా రెండో రోజు యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రమణ అధ్యక్షతన ఓ ప్రైవేట్‌ కల్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్వతీపురం మన్యం జిల్లా పోరాటాలకు పురిటిగడ్డ అని కొనియాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని మండిపడ్డారు. విశాఖ స్టీల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసీ వంటి సంస్థలను ప్రైవేట్‌పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుంటే.. దానికి రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతుండడం విచారకరమన్నారు. కార్మిక హక్కులు సాధించేందుకు ఐకమత్యంతో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మన్యం జిల్లా సీఐటీయూ నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా నిర్వహించారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా డి.రమణా రావు, వై.మన్మఽథరావుతోపాటు కోశాధికారిగా జీవీ రమణ ఎన్నికయ్యారు.

Updated Date - 2022-12-15T00:04:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising