కడుపునొప్పితో గర్భిణి మృతి
ABN, First Publish Date - 2022-08-04T05:37:22+05:30
కడుపునొప్పితో గర్భిణి మృతి
గుర్ల: కోటగండ్రేడు గ్రామానికి చెందిన నిండు గర్భిణి బి.పావని(32) మంగళవారం సాయంత్రం కడుపునొప్పితో బాధపడుతూ మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన బి.పావనికి ఏడాది కిందట రాజమండికి చెందిన వ్యక్తితో వివాహమైంది. ఈ క్రమంలో డెలివరీ కోసం ఇటీవల కన్నవారు తీసుకు వచ్చారు. విజయనగరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తనిఖీలు చేయిస్తున్నారు. మూడురోజుల కిందట గుర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి చూపించారు. మూడు రోజుల కిందట పొత్తి కడుపులో నొప్పి రావడంతో విజయనగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స చేయించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మళ్లీ పొత్తు కడుపులో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మృతి చెందింది. ఈ విషయమై ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను వివరణ కోరగా.. ఆమెకు అనార్యో సమస్య సమస్య ఉందని, ఈ విషయం తమతో చెప్పలేదన్నారు. అయిత్యే తనిఖీకి ఆసుపత్రికి వచ్చేటప్పుడు బాగానే ఉందని తెలిపారు.
Updated Date - 2022-08-04T05:37:22+05:30 IST