నేటి నుంచి పైడిమాంబకు ముర్రాటలు
ABN, First Publish Date - 2022-09-27T05:15:17+05:30
పైడిమాంబ జాతర మహోత్సవాల్లో కీలక ఘట్టంగా నిలిచే ముర్రాటల సమర్పణ మంగళవారం ప్రారంభంకానుంది. అమ్మవారి జాతరకు ముందు ముర్రాటల సమర్పణను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఇప్పిలి వీధి, చినగవర వీధి, బుచ్చెన్న కోనేరు, లంకాపట్టణం, జొన్నగుడ్డి వాసులు ముర్రాటలు సమర్పిస్తారు. మహిళలు పసుపు, కుంకుమ, ఇతర సుగంధ ద్రవ్యాలు కలిపిన నీరును, బిందెలో ఉంచుతారు. ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటారు. ముర్రాటల సమర్పణకు సంబంధించి ఏర్పాట్లను ఉత్సవ కమిటీ ప్రతినిధులు గొల్లకోటి గురునాథ్, శివ, మొల్లెటి నా
సారె సమర్పించిన చిన గవరవీధివాసులు
విజయనగరం రూరల్, సెప్టెంబరు 26: పైడిమాంబ జాతర మహోత్సవాల్లో కీలక ఘట్టంగా నిలిచే ముర్రాటల సమర్పణ మంగళవారం ప్రారంభంకానుంది. అమ్మవారి జాతరకు ముందు ముర్రాటల సమర్పణను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఇప్పిలి వీధి, చినగవర వీధి, బుచ్చెన్న కోనేరు, లంకాపట్టణం, జొన్నగుడ్డి వాసులు ముర్రాటలు సమర్పిస్తారు. మహిళలు పసుపు, కుంకుమ, ఇతర సుగంధ ద్రవ్యాలు కలిపిన నీరును, బిందెలో ఉంచుతారు. ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటారు. ముర్రాటల సమర్పణకు సంబంధించి ఏర్పాట్లను ఉత్సవ కమిటీ ప్రతినిధులు గొల్లకోటి గురునాథ్, శివ, మొల్లెటి నాయుడు, గొబ్బిశెట్టి పెద్దినాయుడు, ధనాజీ, చేపా పైడిరాజు, గొల్లకోటి హారిక పర్యవేక్షించారు. అనవాయితీ ప్రకారం నగరంలోని తహసీల్దారు కార్యాలయానికి ఆనుకొని ఉన్న చినగవర వీధి వాసులు సోమవారం 57 రకాల స్వీట్లను, వివిధ రకాల పండ్లను పైడిమాంబకు సారెగా సమర్పించారు. గవరవీధి, సిద్దాబత్తుల వీధిలో సారెతో ఊరేగించారు. అనంతరం గవరవీధిలో పైడిమాంబకు సమర్పించారు. కాగా పైడిమాంబ ఆలయంలో సోమవారం నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటల నుంచి భక్తులు పూజలు నిర్వహించారు. మూడులాంతర్లు వద్ద ఉన్న చదురుగుడి, రైల్వే స్టేషన్ వద్ద వనంగుడులను విద్యుద్దీపాలతో ఆలంకరించారు. ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
రేపు నగరానికి సిరిమాను చెట్టు...
సిరిమాను చెట్టు బుధవారం నగరానికి రానుంది. మేళతాళాలు, వేదమంత్రాల మధ్య వేడుకగా సిరిమాను చెట్టును తీసుకురానున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు పైడిమాంబ చదురుగుడి వద్ద ప్రత్యేక పూజలు అనంతరం గంట్యాడ మండలం సిరిపురం నుంచి చెట్టుని తీసుకువచ్చే కార్యక్రమం జరగనుంది.. హుకుంపేటలో ఆ చెట్టును సిరిమానుగా మలిచే కార్యక్రమం గురువారం ప్రారంభం కానుంది..
Updated Date - 2022-09-27T05:15:17+05:30 IST