పండగలా మహిళా దినోత్సవం
ABN, First Publish Date - 2022-03-06T04:55:52+05:30
ఈనెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఓ పండగలా నిర్వహించాలని కలెక్టర్ సూర్యకుమారి ఆదేశించారు. ఏర్పాట్లపై వివిధ శాఖ అధికారులతో తన చాంబర్‌లో ఆమె శనివారం సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్ సూర్యకుమారి
కలెక్టరేట్, మార్చి 5: ఈనెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఓ పండగలా నిర్వహించాలని కలెక్టర్ సూర్యకుమారి ఆదేశించారు. ఏర్పాట్లపై వివిధ శాఖ అధికారులతో తన చాంబర్‌లో ఆమె శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆనందగజపతి ఆడిటోరియంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. మహిళలు సాధించిన ప్రగతిని తెలియజేసేలా వివిధ విభాగాల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరించిన మహిళలను గుర్తించి సత్కరించాలని, వారికి విలువైన జ్ఞాపికలను అందజేయాలన్నారు. ప్రఖ్యాతిగాంచిన మహిళా ప్రతినిధులను అతిథులుగా ఆహ్వానించాలని జేసీ వెంకటరావు, ఐసీడీఎస్ పీడీ రాజేశ్వరిలకు సూచించారు. సుమారు 100 మందికి పైబడి మహిళలను సత్కరించనున్నామని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. గ్రామ సచివాలయల్లో మహిళా సర్పంచ్‌లను సన్మానించేలా కార్యక్రమాలు నిర్వహించాలని డీపీవో సుభాషిణిని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ వెంకటరావు, డీఆర్‌వో గణపతిరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ సూర్యనారాయణ, డీఆర్‌డీఏ పీడీ అశోక్‌కుమార్, వ్యవసాయ శాఖ జేడీ రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఉక్రెయిన్ నుంచి 8 మంది రాక
ఉక్రెయిన్ నుంచి ఇప్పటివరకు జిల్లాకు 8 మంది విద్యార్థులు చేరుకున్నట్లు కలెక్టర్ సూర్యకుమారి తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. పార్వతీపురానికి చెందిన సత్తి మౌనిక శనివారం రాత్రి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారని పేర్కొన్నారు. మిగిలిన వారిని కూడా జిల్లాకు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ఆనంది శ్రేయ, యశ్వంత్‌కుమార్ పంచారియ, పాలూరి మౌనిక, పోతురెడ్డి పుష్కరిణి, శశికుమార్ అభిజిత్ అనే మరో ఐదుగురు విద్యార్థులు కూడా హంగేరిలోని బుడాపెస్ట్‌కు చేరుకున్నారని, వారిని కూడా త్వరగా స్వస్థలాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు.
Updated Date - 2022-03-06T04:55:52+05:30 IST