ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువు ఆక్రమణల పరిశీలన

ABN, First Publish Date - 2022-12-31T00:29:55+05:30

కుమ్మపల్లి గ్రామంలో ఆక్రమణకు గురైన బారికబంద జిరాయితీ చెరువేనని రెవె న్యూ అధికారులు తేల్చి చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేపాడ, డిసెంబరు 30 : కుమ్మపల్లి గ్రామంలో ఆక్రమణకు గురైన బారికబంద జిరాయితీ చెరువేనని రెవె న్యూ అధికారులు తేల్చి చెప్పారు. గురువారం చెరువు కప్పివేతపై వ చ్చిన ఫిర్యాదుపై స్పం దించిన వారు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీ లించారు. ఆర్‌ఐ రామలక్ష్మి ఆధ్వర్యంలో సిబ్బంది ఆక్రమణకు గురైన చెరువు స్థలా న్ని పరిశీలించి జిరాయితీ చెరువుగా గుర్తించారు. సర్వే నెంబరు 149/29లో ఏ2-45 సెంట్లుగా గుర్తించారు. రెవెన్యూ ఎఫ్‌సీవో ప్రకారం ఈ చెరువు గ్రామానికి చెందిన ఎస్సీ రైతులు గొర్లె అప్పయ్య, పరదేశి, బోర అప్పయ్య, రాముల పేరున నమోదై ఉందని వారు తెలిపారు. ఆ హద్దులో గల ఓ అసామీ చెట్లను తొలగించి కొంత మట్టిని చెరువు భాగంలో వేయడం వాస్తవమేనని, తక్షణమే తొలగించాలని ఆదేశిం చినట్టు ఆర్‌ఐ తెలిపారు.. రైతుల సమక్షంలో ఆక్రమణదారుతో మాట్లాడి సమస్య పరిష్కరించినట్టు చెప్పారు. దీనిపై తహసీల్దార్‌కు నివేదిక అందజేస్తామన్నారు. ఈ పరిశీలనలో సచివాలయ సర్వేయర్‌, వీఆర్వో తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-31T00:29:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising