ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిగ్నల్స్‌ లేక ...

ABN, First Publish Date - 2022-11-29T00:13:29+05:30

గిరిజనులంతా ఎందుకిలా నిరీక్షిస్తున్నారని అనుకుంటున్నారా? సిగ్నల్‌ సమస్య కారణంగా రేషన్‌ కోసం ఇలా అవస్థలు పడాల్సి వస్తోంది.

డిపోకు కిలో మీటరు దూరంలో కొండ వద్ద గిరిజనులతో వేలి ముద్ర వేయిస్తున్న సేల్స్‌మెన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుదూర ప్రాంతాల నుంచి తప్పని నడక

పాచిపెంట, నవంబరు 28 : ఈ ఫొటోలో ఉన్న గిరిజనులంతా ఎందుకిలా నిరీక్షిస్తున్నారని అనుకుంటున్నారా? సిగ్నల్‌ సమస్య కారణంగా రేషన్‌ కోసం ఇలా అవస్థలు పడాల్సి వస్తోంది. పాచిపెంట మండలం మడవలస గ్రామంలో గిరిజన సహకార సంస్థ డిపో ఏర్పాటు చేశారు. దాని పరిధిలో 18 గ్రామాలకు సంబంధించి 450 కార్డులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే 20 నుంచి 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న వారంతా నడిచి ... ఎన్నో వ్యయప్రయాసాలకొర్చి డిపోకు చేరుకుంటున్నప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతినెలా వారిని సిగ్నల్‌ సమస్య వేధిస్తోంది. సిగ్నల్‌ కోసం కిలో మీటరు దూరాన ఉన్న కొండ వద్ద వారంతా వేలి ముద్ర వేసిన తరువాత మళ్లీ బియ్యం కోసం డిపోకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మాన్యువల్‌గా రేషన్‌ వచ్చేటట్టు చూడాలని ఆయా ప్రాంత గిరిజనులు కోరుతున్నారు. అదేవిధంగా కిలోమీటర్ల దూరం నడవలేకపోతున్నామని, తమ గ్రామాలకు అందుబాటులో ఉండే విధంగా డిపో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2022-11-29T00:13:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising