ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ స్థాయి స్వచ్ఛ పురస్కార్‌ అవార్డు

ABN, First Publish Date - 2022-11-03T00:12:45+05:30

విజయనగరం కార్పోరేషన్‌ పరిధిలోని జమ్ము మండల పరిషత్‌ ప్రాధమిక పాఠశాలకు కేంద్ర ప్రభుత్వం అందించే స్వచ్ఛ విద్యాలయ జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికైనట్లు పాఠశాల విద్యా కమిషనర్‌ సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు ఎస్‌ సురేష్‌ కుమార్‌ ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం, నవంబరు 2: విజయనగరం కార్పోరేషన్‌ పరిధిలోని జమ్ము మండల పరిషత్‌ ప్రాధమిక పాఠశాలకు కేంద్ర ప్రభుత్వం అందించే స్వచ్ఛ విద్యాలయ జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికైనట్లు పాఠశాల విద్యా కమిషనర్‌ సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు ఎస్‌ సురేష్‌ కుమార్‌ ప్రకటించారు. బుధవారం ఆయన ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. 2021-22 విద్యా సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా ఓవరాల్‌ కేటగరీలో 34 పాఠశాలు, సబ్‌ కేటగరీలో 5 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జమ్ము మండల ప్రాథమిక పాఠశాల ఎంపిక కావటం హర్షనీయమని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామ్మోహనరావు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించటమే కాకుండా సామాజి బాధ్యతలను, పరిసరరాల పరిశుభ్రత, ఆరోగ్యం వంటి అంశాలను తెలియజేస్తున్నామన్నారు. కేంద్ర కమిటీ పరిశీలన చేసినపుడు కూడా పాఠశాల తీరుతెన్నులపై సంతృప్తి వ్యక్తం చేసి విషయాన్ని గుర్తు చేశారు. ఇదివరకు కూడా తమ పాఠశాల జిల్లా, రాష్ట్ర స్థాయి అవార్డులు గెలుచుకుందన్నారు. ఇపుడు జాతీయ స్థాయి అవార్డు రావటం హర్షనీయమని చెప్పారు. ఈనెల 19న ఢిల్లీలో జరిగే పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో రూ.60వేలు నగదు. పురస్కారం(జ్ఞాపిక) అందిస్తారని చెప్పారు.

Updated Date - 2022-11-03T00:12:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising