రెండు పూట్లా బోధించరూ..
ABN, First Publish Date - 2022-10-18T04:12:15+05:30
తమ పాఠశాలలో జూనియర్, డిగ్రీ విద్యార్థులకు బోధించడం వల్ల ఒక పూట తరగతులే నిర్వహిస్తున్నారని, తాము తీవ్ర ఇబ్బంది పడుతున్నామని రాజాం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందనలో విన్నవించుకున్నారు.
కలెక్టర్‌కు రాజాం పాఠశాల విద్యార్థుల వినతి
తమ పాఠశాలలో జూనియర్, డిగ్రీ విద్యార్థులకు బోధించడం వల్ల ఒక పూట తరగతులే నిర్వహిస్తున్నారని, తాము తీవ్ర ఇబ్బంది పడుతున్నామని రాజాం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందనలో విన్నవించుకున్నారు. ఈ పాఠశాలలో దాదాపు 1000 మంది విద్యార్థులు చదువుతున్నారు. సమీపంలో ఉన్న రెండు కళాశాలల భవనాల్లో నాడు-నేడు పనులు జరుగు తున్నాయి. దీంతో వారికి ఒకపూట తరగతులు పాఠశాల భవనంలో చెబుతున్నారు. దీనివల్ల సిలబస్ పూర్తి కావడం లేదని పాఠశాల విద్యార్థులు వాపోయారు. తమకు రెండు పూటలా తరగతులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
- కలెక్టరేట్
Updated Date - 2022-10-18T04:12:15+05:30 IST