బైకులు ఢీకొని వ్యక్తికి గాయాలు
ABN, First Publish Date - 2022-10-18T05:12:21+05:30
మండలంలోని కామన్నవలస, గజరాయనివలస ఎరుకులపాకల మధ్యలో ఆదివారం రాత్రి రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయ్యా యని హెచ్‌సీ ఉమామహేశ్వరరావు తెలిపారు.
బాడంగి: మండలంలోని కామన్నవలస, గజరాయనివలస ఎరుకులపాకల మధ్యలో ఆదివారం రాత్రి రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయ్యా యని హెచ్‌సీ ఉమామహేశ్వరరావు తెలిపారు. వారి కథనం ప్రకారం.. డొంకినవల స గ్రామానికి చెందిన చింతాడ మోహనరావు రామభద్రపురంలోని హోటల్‌లో పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో రామభద్రపు రం నుంచి బైకుపై ఇంటికి వస్తుండగా, గజరాయనివలస గ్రామానికి చెందిన కం దుల చైతన్య వెనుక నుంచి బైకుతో వచ్చి ఢీకొన్నాడు. దీంతో మోహనరావుకు కాలు, మొఖంపై గాయాలు కాగా, చైతన్యకు నుదురు, కాలుపై గాయాలయ్యాయి. మోహనరావు ఫిర్యాదు మేరకు హెచ్‌సీ ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2022-10-18T05:12:21+05:30 IST