చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయండి
ABN, First Publish Date - 2022-12-16T23:58:08+05:30
చంద్రబాబు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు పిలుపునిచ్చారు. ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కార్యక్రమ నిర్వహణపై యనమల రామకృష్ణుడు శుక్రవారం అశోక్ గజపతిరాజుతో చర్చించారు. దాదాపు గంట పాటు సమావేశమయ్యారు. రూట్ మ్యాప్‌పై చర్చించారు.
చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయండి
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, అశోక్‌గజపతిరాజు
విజయనగరం రూరల్, డిసెంబరు 16: చంద్రబాబు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు పిలుపునిచ్చారు. ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కార్యక్రమ నిర్వహణపై యనమల రామకృష్ణుడు శుక్రవారం అశోక్ గజపతిరాజుతో చర్చించారు. దాదాపు గంట పాటు సమావేశమయ్యారు. రూట్ మ్యాప్‌పై చర్చించారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించడంతో పాటు ఇన్‌చార్జిలకు మరిన్ని బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ స్థితిగతులు వారి మధ్య చర్చకు వచ్చాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీ బలోపేతానికి టీడీపీ శ్రేణులు కృషిచేయాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు.
Updated Date - 2022-12-16T23:58:09+05:30 IST