ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ సవరణ బిల్లుపై భగ్గు

ABN, First Publish Date - 2022-08-10T05:10:58+05:30

కేంద్ర ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెడుతున్న విద్యుత్‌ సవరణ బిల్లును వ్యతిరేకించాలని సీపీఎం, సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

విద్యుత్‌ బిల్లు పత్రాలను దహనం చేస్తున్న వామపక్షాల నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  వామపక్షాల నిరసన 

 పత్రాల దహనం 

 కేంద్రం తీరుపై మండిపాటు

పార్వతీపురంటౌన్‌, ఆగస్టు9 : కేంద్ర ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెడుతున్న విద్యుత్‌ సవరణ బిల్లును వ్యతిరేకించాలని సీపీఎం, సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలోని బెలగాం సీపీఎం కార్యాయం ఎదుట విద్యుత్‌ సవరణ బిల్లు పత్రాలను దహనం చేశారు. కేంద్రం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్‌ అంశంపై రాష్ట్రాలతో సంప్రదించకపోవడం దారుణమన్నారు.  బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కును కాలరాస్తోందని ఆరోపించారు.  2017 ఏప్రిల్‌లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా  బిల్లును అమోదించడం అన్యాయమన్నారు. అన్ని వర్గాలు వ్యతిరేకించినా కేంద్ర సర్కారు పట్టించుకోకపోవడం విచారకరమని తెలిపారు. రైతులు, సామాన్య ప్రజానీకానికి కష్టాలు తెచ్చిపెట్టే ఈ బిల్లును మేధావులు, విద్యావంతులు వ్యతిరేకించాలన్నారు. వామపక్ష నాయకులు రమణ, మన్మథరావు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-08-10T05:10:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising