కళా వెంకటరావును కలిసిన కోళ్ల లలితకుమారి
ABN, First Publish Date - 2022-12-16T00:00:22+05:30
నియోజకవర్గం లో టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని, పార్టీకి పూర్వ వైభ వం తీసుకురావాలని పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట రావు సూచించారు
రాజాం: నియోజకవర్గం లో టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని, పార్టీకి పూర్వ వైభ వం తీసుకురావాలని పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట రావు సూచించారు. గురువా రం రాజాం క్యాంపు కార్యాల యంలో కళావెంకటరావును ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కలిశారు. ఈ సందర్భంగా కళా మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజాం నియోజకవర్గంలో ఈనెల 22న జరగనున్న ‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొంటారని, సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్తా మని లలితకుమారికి తెలిపారు. కార్యక్రమంలో కోళ్ల రామప్రసాద్ పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T00:00:24+05:30 IST