ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kimidi Nagarjuna : రిజర్వేషన్లను ఎత్తేసి.. కాపులను ఉద్ధరించినట్టుగా మాటలు..

ABN, First Publish Date - 2022-11-01T13:07:11+05:30

వైసీపీ నాయకులు (YCP Leaders) కాపు కులాలను ఉద్ధరించినట్టుగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున (Kimidi Nagarjuna) విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Vijayanagaram : వైసీపీ నాయకులు (YCP Leaders) కాపు కులాలను ఉద్ధరించినట్టుగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున (Kimidi Nagarjuna) విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కాపు రిజర్వేషన్ (Kapu Reservations) కోసం ఓ కమిషన్ ఏర్పాటు చేసి అయిదు శాతం రిజర్వేషన్ కల్పించారన్నారు. కాపు కులాలకు సంబంధించి జగన్ వచ్చాక ఆ రిజర్వేషన్ ఎత్తేసి.. తిరిగి వైసీపీ నాయకులు కాపులని ఏదో ఉద్ధరించినట్టుగా మాట్లాడుతున్నారని కిమిడి నాగార్జున పేర్కొన్నారు. ‘వైసీపీ కాపు నాయకులంతా మీటింగ్‌లు పెట్టి విద్వేషాలు రెచ్చగొడుతున్నారా? కులాల మధ్య చిచ్చు పెడుతున్నారా?’ అని ప్రశ్నించారు. గతంలో రెండు కుటుంబాల మధ్య తగాదా కారణంగా వంగవీటి రంగా (Vangaveeti Ranga) హత్య జరిగిందన్నారు. రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ కారణంగా జరిగిన హత్య రెండు పార్టీల మధ్య తగాదాలుగా చూడొద్దని నాగార్జున సూచించారు.

‘జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు.. మరి ఆయనను ఎన్ని విధాలుగా అవమానిస్తున్నారు? ఎన్ని రకాలుగా దెబ్బ తీయాలని చూస్తున్నారు? నిన్నటి సమావేశంలో కాపుల అభ్యున్నతి కోసం మాట్లాడితే బాగుండేది. ఉత్తరాంధ్ర కాపు నేత బొత్స మాట ఇప్పుడు చెల్లుబాటు అవుతుందా? ఉత్తరాంధ్ర జిల్లాలను గతంలో విజయసాయిరెడ్డి (Vijayasai Reddy), ఇప్పుడు మరో రెడ్డికి అప్పజెప్పారు. ఇలా రాష్ట్రాన్ని ఒక సామాజిక వర్గానికే అప్పచెప్పి కాపులను ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారు. రామతీర్థం గొడవలో ఇక్కడి కాపు నాయకులు, బీసీల మీద కేసులు పెట్టి వేదించారు. ఇలా కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు, వ్యాఖ్యలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని కిమిడి నాగార్జున పేర్కొన్నారు.

Updated Date - 2022-11-01T13:08:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising