ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో కేజీబీవీ ప్రిన్సిపాల్‌ మృతి

ABN, First Publish Date - 2022-12-31T00:06:16+05:30

శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ మండలం వైకుంఠపురం గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్‌ఎన్‌పేట కేజీబీవీ ప్రిన్సిపాల్‌ మండాల శ్రీదేవి (38) మృతిచెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బూర్జ/పాలకొండ: శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ మండలం వైకుంఠపురం గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్‌ఎన్‌పేట కేజీబీవీ ప్రిన్సిపాల్‌ మండాల శ్రీదేవి (38) మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకా రం.. పాల కొండ పట్టణంలోని పెద్దకాపువీధికి చెందిన శ్రీదేవి ద్విచక్ర వాహ నంపై పాలకొండ నుంచి ఆమదాలవలస వైపు వెళ్తుండగా వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయ పడిన ఆమెను శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందారు. ఇన్‌చార్జి ఎస్‌ఐ కె.కృష్ణ ప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీదేవి తండ్రి లక్షుంనాయుడు చనిపోవడంతో తల్లి విజయలక్ష్మి కుటుం బాన్ని పోషించింది. తల్లి కష్టం తెలుసుకున్న శ్రీదేవి కష్ట పడి ప్రభుత్వ ఉపాధ్యా యినిగా ప్రభుత్వ కొలువు సాధించింది.తన అక్కచెల్లెతో పాటు సోదరుడి కుటుంబా నికి ఆసరాగా ఉంటుంది. కాగా, ఎల్‌ఎన్‌పేటలో ప్రిన్సి పాల్‌గా పనిచేస్తున్న శ్రీదేవిని అక్కడి రాజకీయ నాయకులు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారని, మానసికంగా ఇబ్బంది పెట్టారని, ఆమెపై అధికారులకు ఫిర్యాదు చేశారని బంధువులు చెబుతున్నారు. దీంతో ఆమె రోడ్డు ప్రమాదానికి గురయ్యారని ఆరోపిస్తున్నారు.పాలకొండ ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ విక్రాంత్‌ సంతాపం తెలిపారు.

Updated Date - 2022-12-31T00:06:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising