ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీలో పలు కుటుంబాల చేరిక

ABN, First Publish Date - 2022-12-15T00:08:31+05:30

దత్తి గ్రామంలో పలు కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే, గజపతినగరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కేఏ నాయుడు ఆధ్వర్యంలో చేరాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దత్తిరాజేరు: దత్తి గ్రామంలో పలు కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే, గజపతినగరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కేఏ నాయుడు ఆధ్వర్యంలో చేరాయి. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో రేజేటి చిన్నారావు, చింతపల్లి రమేష్‌, చింతపల్లి భాస్కరరావు, తలారి తిరుపతి, తలారి ఆదినారాయణ, రౌతు రామారావు, పల్లేడ రామారావు, నేరడబల్లి పైడి తల్లి, రుద్ర సూర్యనారాయణ తదితర కుటుంబాలకు చెందినవారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భం గా కేఏ నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ పాలనపై ప్రజలు విసిగిపోయారన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు పెద్దింటి మోహన్‌, మాజీ జడ్పీటీసీ బండారు బాలాజీ, మజ్జి మహేష్‌, గుసిడి జగన్నాథం, గేదెల రామసత్యం, తాడ్డి రవి, గౌరినాయుడు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం

బొండపల్లి: టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని గజపతినగరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు అన్నారు. బుధవారం ముద్దూరు, తమటాడ గ్రామాల్లో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబను మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు కోరాడ కృష్ణ, నాయకులు గోపాలరాజు, బండారు బాలాజీ, వేమలి చైతన్య, కల్యాణపు నారాయణరావు, బొడ్డు ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:08:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising