బైక్ చోరీ చేసిన వ్యక్తికి జైలు
ABN, First Publish Date - 2022-01-13T05:38:12+05:30
పోలీసునని చెప్పి ద్విచక్రవాహనాన్ని చోరీ చేసిన వ్యక్తికి బుధవారం కొత్తవలస మేజిస్ట్రేట్ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించినట్లు శృంగవరపుకోట ఎస్‌ఐ ప్రసన్నకుమార్ తెలిపారు.
శృంగవరపుకోట: పోలీసునని చెప్పి ద్విచక్రవాహనాన్ని చోరీ చేసిన వ్యక్తికి బుధవారం కొత్తవలస మేజిస్ట్రేట్ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించినట్లు శృంగవరపుకోట ఎస్‌ఐ ప్రసన్నకుమార్ తెలిపారు. 2018 సంవత్సరంలో స్థానిక పుణ్యగిరి రోడ్డులో పల్సర్ బైక్‌పై వస్తున్న వ్యక్తిని సివేరు రాము పోలీస్‌నని చెప్పి ఆపి బైక్‌ను తీసుకుని పరారయ్యాడు. బాధితుని ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ అమ్మినాయుడు కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ తెలిపారు.
Updated Date - 2022-01-13T05:38:12+05:30 IST