ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగనన్నా.. ఇదేందన్నా!

ABN, First Publish Date - 2022-05-15T05:28:44+05:30

ప్రతి పేదవాడు సొంతింటి కల 2022లో నిజం చేస్తా. మీకు ఇళ్లు కట్టుకునే స్ధోమత లేకుంటే ప్రభుత్వమే కట్టించి ఇస్తుంది. మీతో స్వయంగా గృహప్రవేశం చేయిస్తా’ ఇది సీఎం వైఎస్‌ జగన్‌ జగనన్న మాట.

ఇదే 19మంది లబ్ధిదారులకు పెధఖండేపల్లి ఇచ్చిన జగనన్న కాలసీ మెట్టస్ధలం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇళ్లు కట్టిస్తానని చెప్పి పట్టాలు రద్దు చేస్తివే
అనువుగాని చోట ఇస్తే ఎలా కట్టుకోవాలి?
రెండు గ్రామాల లబ్ధిదారుల అసంతృప్తి

ప్రతి పేదవాడు సొంతింటి కల 2022లో నిజం చేస్తా. మీకు ఇళ్లు కట్టుకునే స్ధోమత లేకుంటే ప్రభుత్వమే కట్టించి ఇస్తుంది. మీతో స్వయంగా గృహప్రవేశం చేయిస్తా’ ఇది సీఎం వైఎస్‌ జగన్‌ జగనన్న మాట. ఇది నీటిరాత తేలిపోయింది. ప్రస్తుతం లబ్ధిదారులే ఇళ్లు కట్టుకోవాలని, ఆలస్యం చేస్తే పట్టా రద్దు చేస్తామని మండల అధికారులు, వలంటీర్లు ఒత్తిడి తెస్తున్నారు. చివరకు ఆ రెండు గ్రామాల్లో పట్టాలను రద్దు చేసేశారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

శృంగవరపుకోట రూరల్‌, మే 14: మండలంలోని పెదఖండేపల్లిలో 19మంది లబ్ధిదారులకు జగనన్న ఇంటి స్థలాలను రాతిమెట్టలో కేటాయించారు. ప్రభుత్వం తమకు స్ధలం ఇచ్చిందన్న ఆనందంతో లబ్ధిదారులు ఇళ్లు కట్టేందుకు సిద్ధపడ్డారు. పునాదులు తీసేందుకు ప్రయత్నించారు. ఎంత తవ్వినా రాయి కనిపిస్తోంది. దీనికే వేలాదిరూపాయిలు ఖర్చు పెట్టుకున్నారు. దీంతో ప్రభుత్వం ఇచ్చిన మూడో ఆప్షన్‌ ప్రకారం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. అయితే అధికారులు మాత్రం ప్రభుత్వం ఇప్పుడు నిర్మించి ఇచ్చే స్థితిలో లేదని, లబ్ధిదారులే కట్టుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. తాము కట్టుకోలేమంటూ లబ్ధిదారులు చేతులెత్తేశారు. అయితే అధికారులు ఇళ్ల కట్టుకోకపోతే పట్టాలు రద్దు చేస్తామని హెచ్చరించారు. చివరకు ఇక్కడ మంజూరు చేసిన 19 పట్టాలను రద్దుచేశారు. ప్రభుత్వం తీరుపై లబ్ధిదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక వెంకటరమణపేట గ్రామ పంచాయతీలో ఊరికి దూరంగా క్వారీ రహాదారిలో మల్లిపూడి వద్ద 54మంది పేదలకు జగనన్న ఇంటి స్థలాలు ఇచ్చారు. ఇది ఊరికి మూడుకిలోమీటర్ల దూరం ఉంది. దీంతో లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేపట్టలేదు. ఊరికి దగ్గరగా ఇవ్వాలని కోరారు. ఇళ్లు కట్టకపోతే పట్టాలు రద్దుచేస్తామని అధికారులు, వలంటీర్లు హెచ్చరించారు. పట్టాలు వెనక్కి ఇచ్చేయండంటూ ఒత్తిడి చేయడంతో 14మంది లబ్ధిదారులు గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇచ్చేశారు. మరికొందరు కూడా ఇదేబాటలో ఉన్నారు. ఈవిషయంమై వారు మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కలను ముఖ్యమంత్రి బాగానే నిజం చేశారని, ఇంటిని పేదవాని కలగానే మిగిల్చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పెత్తందారుల చేతిలో ఉన్న భూములను స్వాధీనం చేసుకుని పట్టాలు ఇవ్వాలని కోరారు. దీనిపై గట్టిగా ప్రశ్నిద్దామంటే తమ రేషన్‌కార్డులు, పింఛన్లు కట్‌ చేస్తారన్న భయంతో నోరు మెదపకుండా ఉన్నామన్నారు

తహసీల్దార్‌ ఏమన్నారంటే..

పెదఖండేపల్లిలో లబ్ధిదారులకు ఇల్లు కట్టలేదు. పలుమార్లు గ్రామసభలు పెట్టినా వారు స్పందించకపోవడంతో పాటు రాతి నేలపై ఇళ్లు కట్టలేమని చెప్పారు. ఈ విషయం ఆర్డీవోకు చెప్పాము. ఇళ్లు కట్టకపోతే పట్టాలు తీసుకోవాలని ఆర్డీవో ఆదేశించారు. దీంతో పట్టాలు తీసుకున్నాము. ఇదే సమయంలో లబ్ధిదారులకు అనువుగా ఉండే స్థలం కోసం ఆన్వేషిస్తున్నాం. ఇక వెంకటరమణపేట గ్రామంలో 54మందికి ఇచ్చాం. ఊరికి దూరంగా ఉన్నాయని లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో వారి నుంచి పట్టాలు తీసుకుంటున్నాం. వారి స్థానంలో ఇతరులను ఎంపిక చేస్తాం.


Updated Date - 2022-05-15T05:28:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising