జేఏసీ సదస్సు విజయవంతానికి పిలుపు
ABN, First Publish Date - 2022-12-16T23:56:19+05:30
విజయవాడ కందుకూరి కల్యాణ మండపం (జింఖానా గ్రౌండ్స్)లో ఈ నెల 18న నిర్వహించనున్న దళిత గిరిజన జేఏసీ సదస్సుకు గిరిజనులంతా తర లివచ్చి విజయవంతం చేయాలని జేఏసీ ప్రతినిధి, బీఎస్పీ జిల్లా నేత సోరు సాం బయ్య పిలుపునిచ్చారు.
బొబ్బిలి: విజయవాడ కందుకూరి కల్యాణ మండపం (జింఖానా గ్రౌండ్స్)లో ఈ నెల 18న నిర్వహించనున్న దళిత గిరిజన జేఏసీ సదస్సుకు గిరిజనులంతా తర లివచ్చి విజయవంతం చేయాలని జేఏసీ ప్రతినిధి, బీఎస్పీ జిల్లా నేత సోరు సాం బయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన పోస్టర్లను పట్టణంలో విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన సంక్షేమ, అభి వృద్ధి పథకాలను పునరుద్ధరించాలని, రాజ్యాంగ బద్ధంగా సంక్రమించిన హక్కులు, చట్టాలను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేయడాన్ని విరమించుకోవాలన్నారు.
Updated Date - 2022-12-16T23:56:21+05:30 IST